తాను పుట్టినప్పటి నుంచి ఇంతగా సంతోషపడిన సందర్భం లేదన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆయనను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.

అనంతరం ప్రగతి భవన్ వద్ద సాయికిరణ్ మీడియాతో మాట్లాడారు. తనను అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సాధించడానికి కేసీఆర్ ఎంతగానో పోరాడారని, రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్నారన్నారు.

ఎంతో మంది దిగ్గజ నేతలు ఉండగా తన లాంటి యువకుడికి కేసీఆర్ యువతను ప్రొత్సహించాలనే ఉద్దేశ్యంతో లోక్‌సభ టికెట్ కేటాయించారని సాయికిరణ్ స్పష్టం చేశారు.