మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ ఓటర్లు పోలింగ్ బూతులకు పోటెత్తారు. పట్టణ ప్రాంత ఓటర్లు ఎన్నికలపై ఆసక్తి చేపించకున్నా గ్రామీణ ఓటర్లు ప్రజాస్వామ్యం అందించిన హక్కును వినియోగించుకోడానికి ముందుకు కదిలారు. ఇలా దాదాపు 40  డిగ్రీల ఎండలో ఓటేయడానికి వెళుతూ వడదెబ్బ చాలామంది అస్వస్థతకు గురవగా మరికొంతమంది ప్రాణాలను వదిలారు.    

ఈ విధంగా వడదెబ్బకు గురై గురువారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఈ మతుల్లో అత్యధికులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారే. నకిరేకల్ ఎల్లయ్య(40), కోదాడలో రామదుర్గయ్య(84),కృష్ణయ్యలు, కట్టంగూరు గ్రామంలో వెంకన్న ఓటేయడానికి వెళ్లి ఎండవేడికి తట్టుకోలేక మృతిచెందారు. ఇక నాగర్ కర్నూల్ లో బాలస్వామి, ములుగులో అక్కమ్మ అనే దివ్యాంగురాలు కూడా వడదెబ్బ తగిలి మృతి చెందారు. 

ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎండను సైతం లెక్కచేయకుండా పోలింగ్ లో పాల్గొన్న ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు.  అమరావతి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి కృష్ణా, శ్రీకాకుళం, చిత్తూరు లో ఒక్కరు అనంతరం జిల్లాలో ఇద్దరు వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు సమాచారం. వృద్ధులు, మహిళల కోసం ఎన్నికల సంఘం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తమ వారు మరణించారని మృతుల బంధువులు ఆరోపించారు.