Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో రూ.8 కోట్ల నగదు పట్టివేత...ఆ జాతీయ పార్టీవేనా?

లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ సోమవారం పోలీసులు చేపట్టిన తనిఖీలో భారీఎత్తుల నగదు పట్టుబడింది. నారాయణ గూడ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్న నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది కోట్ల రూపాయల నగదు ని పట్టుకున్నారు. ఓ కారులో వీటిని తరలిస్తూ ఓ జాతీయ పార్టీ కార్యాలయ నిర్వహకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడితో పాటు మరికొంతమంది కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. 

RS 8 crores seized in telangana police at narayanaguda
Author
Hyderabad, First Published Apr 8, 2019, 8:59 PM IST

లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ సోమవారం పోలీసులు చేపట్టిన తనిఖీలో భారీఎత్తుల నగదు పట్టుబడింది. నారాయణ గూడ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్న నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది కోట్ల రూపాయల నగదు ని పట్టుకున్నారు. ఓ కారులో వీటిని తరలిస్తూ ఓ జాతీయ పార్టీ కార్యాలయ నిర్వహకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడితో పాటు మరికొంతమంది కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. 

ఈ డబ్బులకు సంబంధించిన సరైన ఆధారాలు, రశీదులు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని తరలిస్తున్న వారిని విచారించగా తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి తీసుకువెళుతున్నట్లు వెల్లడించనట్లు సమాచారం. ఈ ఎనిమిది కోట్ల నగదుకు తనకు ఎలాంటి సంభందం లేదని సదరు వ్యక్తి పోలీసులకు తెలియజేసినట్లు తెలస్తోంది. 

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న తనిఖీల్లో కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు, సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేస్తున్నారు. ఎన్నికలు కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 377 కోట్లు పట్టుబడగా ఒక్క ఏపినుండే రూ. 97 కోట్లు వున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు రూ. 32 కోట్లు సీజ్ చేయగా ఇప్పుడు మరో ఎనిమిది కోట్లు ఆ ఖాతాలోకి చేరి  40 కోట్లకు చేరాయి. 
 
Follow Us:
Download App:
  • android
  • ios