సార్వత్రిక ఎన్నికల వేళ..హైదరాబాద్ నగరంలో నగదు కలకలం రేపింది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి నుంచి పోటీచేస్తున్న ఓ అభ్యర్థి ఈ నగదు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా.. ఈ నగదు తీసుకువెళ్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడికారులో నగదు తీసుకువచ్చి.. వోల్క్స్ వాగెన్ లోకి మారుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారులో మొత్తం రూ.49లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. ఆ నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.