2008లో బీఎస్పీతో ప్రజారాజ్యం పార్టీ పెట్టుకోవాల్సిందని కానీ అది 11 ఏళ్ల తర్వాత సాకారమైందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన , బీఎస్పీ చీఫ్ మాయావతితో కలిసి ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు.

2009లో సామాజిక న్యాయం చేస్తామని తనను, అన్నయ్యను ఉస్మానియా ప్రొఫెసర్లు, విద్యార్థులు నమ్మారన్నారు. ఇంత పెద్ద నటుడినైయుండి, కోట్లాది మందికి తెలిసుండి పార్టీ పెట్టాలంటే తాను ఎన్నో రకాలుగా నలిగిపోయానన్నారు పవన్.

మరి మాయావతి .... నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ, కేసీఆర్ కుమార్తె కవితలాంటి వారు కాదని, ఉన్నత కులాల నుంచి రాలేదని కేవలం ఒక చిన్న పాటి పోస్టల్ క్లర్క్ కూతురని జనసేనాని స్పష్టం చేశారు.