Asianet News TeluguAsianet News Telugu

పసుపు రైతులను పట్టించుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వమే.. కవిత

 

పసుపు బోర్డులు ఏర్పాటు కోసం తాను ఎక్కడా లేదని మొక్కని బండ లేదని అన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. 

mp kavitha comments in election campaign
Author
Hyderabad, First Published Mar 27, 2019, 11:59 AM IST

పసుపు బోర్డులు ఏర్పాటు కోసం తాను ఎక్కడా లేదని మొక్కని బండ లేదని అన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. మంగళవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూరు, వేములకుర్తి, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలలో రోడ్ షోలలో ప్రసంగించారు

.పసుపు గురించి పార్లమెంటులో మాట్లాడటమే కాదు.. ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా ప్రవేశపెట్టాననీ తెలిపారు. హైదరాబాద్ కు కామర్స్ కమిటీ వస్తే రైతులను తీసుకెళ్ళి  కల్పించాననీ చెప్పారు. పసుపు రైతులను ఏనాడు ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదన్నారు.పసుపు రైతులను పట్టించుకుంది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 

పసుపు రైతుల కష్టాలు తెలిసిన సిఎం  కేసీఆర్ రూ.4 లక్షల  ధర  ఉండే  పసుపు బాయిలర్ లకు రెండు లక్షల సబ్సిడీ ఇచ్చారని, ఈ ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంది అని కవిత అన్నారు.కోరుట్ల నియోజకవర్గం లో 100 మంది పసుపు రైతులకు రెండు లక్షల చొప్పున బాయిలర్లు కొనుగోలుకు  సబ్సిడీ  ఇచ్చామని తెలిపారు రైతన్నల సమస్యలపైన చిత్తశుద్ధితో పని చేసేది టిఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు.

 

పసుపు రైతుల ఆవేదన మాకు అర్థమైంది కాబట్టే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రం పై ఒత్తిడి తెచ్చామని చెప్పారు. అయినా ప్రధాని నరేంద్ర మోడీ కీ మనసు కరగలేదు అన్నారు ఎంపి కవిత.అయితే నిన్న బిజెపి  నాయకుడు రాంమాధవ్  పసుపు రైతుల కు ఏదో చేస్తున్నట్లు చిలక పలుకులు పలికారన్నారు.పసుపు బోర్డు సాధనను కొనసాగిస్తానని స్పష్టం చేశారు 

నిజామాబాద్ పార్లమెంట్  పరిధిలో ఐదేళ్లలో  15 వేల కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయించానని తెలిపారు. అక్కా.. ఉల్లాసంగా వచ్చాం మీటింగ్ కు.. ఉత్సాహంగా ఓటేస్తాం అని మహిళలు చెప్తున్నారు ..ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి గా చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితం అని కవిత  వివరించారు.


మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏకపక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని తీర్పునిచ్చారు అని  కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ చాలా రాష్ట్రాల్లో  తగ్గుతోంది అని సర్వే లు చెపుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీ కి కూడా పూర్తి స్థాయి సీట్లు రావని చెబుతున్నా యి. తెలంగాణలో టిఆర్ఎస్ ఎట్లా బలంగా ఉందో ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్నాయి వాటన్నిటిని కూడగట్టి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. 

కాంగ్రెస్ , బిజెపిల వల్ల దేశం లో అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్నారు ఎంపి కవిత.ఐదేళ్లలో తెలంగాణ అభివృద్ధినీ  మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు . 70ఏళ్ల దేశంలో ఎందుకు అభివృద్ధి చెంద లేదన్న విషయం ఆలోచించాలని కవిత కోరారు.

మన రైతు బందు ను కాపీ కొట్టిన నరేంద్ర మోడీ మనం 10వేలు ఇస్తుంటే 2000 ఇచ్చి తెలుగు పేరును మార్చి హిందీ పేరుతో పథకాన్ని ప్రకటించారు. ఇది మన ముఖ్యమంత్రి సాధించిన విజయంగా మనం గర్వపడాలి అన్నారు. 

ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. అసలే జాగా లేనివారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తాం ..జాగా ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారిని కట్టుకోమంటాం అని తెలిపారు. కిరాయి ఇంట్లో ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి కోరుట్ల నియోజకవర్గం లో ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే లక్ష్యంతో పని చేస్తామని ఎంపీ కవిత స్పష్టం చేశారు.

అన్ని రకాల పెన్షన్లను ప్రభుత్వం డబుల్ చేసిందని మే 1 నుంచి పెరిగిన పెన్షన్ల డబ్బు చేతికి అందుతుంది అని తెలిపారు. నిరుద్యోగులకు భృతి గా మూడు వేల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. కులవృత్తులకు లోన్లు ఇప్పిస్తామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టించి వారి ఆదాయాన్ని పెంచుతామని అన్నారు. 

నేను స్వయంగా వచ్చి ఆడబిడ్డలు ఈ పనులు ఎలా చేస్తున్నారో పరిశీలిస్తానని కవిత అన్నారు.ఎన్నికల్లో రకరకాల హామీలు ఇస్తారు.. రకరకాల ప్రచారం చేస్తారు అన్నింటిని వివేకంతో పరిశీలించాలి..ఆగం కావ ద్దు.. మన కోసం పనిచేసే ప్రభుత్వం, పార్టీ ఏంటో తెలుసుకుని ఓటు వెయ్యాలి అని ఉద్బోధించారు. బిజెపి సోషల్ మీడియా లో దుష్ప్రచారాలు చేస్తున్నారు యువకులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

మనం ఇస్తున్న  వెయ్యి రూపాయల పెన్షన్ల లో 800 రూపాయలు కేంద్రమే ఇస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారు.. అదే నిజమైతే నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో 750 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.. మరి ఇక్కడ 800 ఇస్తే.. అక్కడ 750 మాత్రమే ఇస్తున్నారు..అంటే బిజెపి నాయకులు చేస్తోంది గోబెల్స్ ప్రచారం అని అర్థం చేసుకోవాలి...అని ఎంపి కవిత ప్రజలను  కోరారు.

 ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కరీంనగర్ జడ్పి వైస్ చైర్ పర్సన్ తుల ఉమ,  స్థానిక సంస్థల నాయకులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios