లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంపై ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎంపీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను సొంత తమ్ముడిలా చూసుకున్నారని, ఆయనపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.

నాకు టికెట్ ఇవ్వకపోవడంపై తన వద్ద సమాధానం లేదన్నారు. కాగా మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త మన్నే శ్రీనివాస్‌రెడ్డిని టీఆర్ఎస్ ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో బీ ఫారాలను సైతం అందజేశారు.