లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని స్థానాలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే తుది జాబితాలో నల్గొండ పార్లమెంటు స్థానానికి గాను సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అభ్యర్థుల ప్రకటనకు ముందు ప్రగతీ భవన్‌కు చేరుకున్న గుత్తా... తన పేరు లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాగా ఆ వెంటనే శాసనమండలిలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాల్లో రెండు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు.

ఇందులో గుత్తా సుఖేందర్ రెడ్డికి, హైదరాబాద్‌కు చెందిన కుర్మయ్యపాటి నవీన్ ‌కుమార్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం నిర్ణయించారు.