హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి మల్లారెడ్డి. కొడంగల్ లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి వచ్చి పోటీ చేస్తాడంట అంటూ విరుచుకుపడ్డారు. 

రేవంత్ రెడ్డికి డిపాజిట్ కూడా రాకూడదంటూ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో ఏస్తాడట, పీకుతాడట ఊకేస్తాడట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రా మల్కాజ్ గిరిలో చూసుకుందాం అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్ల పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పుకొచ్చారు. రేవంత్ కు డిపాజిట్ దక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ టీఆర్ఎస్ కార్యకర్తపైనా ఉందని మల్లారెడ్డి స్పష్టం చేశారు.