తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పోలింగ్ లో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ, సీని ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం కమలాపూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం ఈటల మాట్లాడుతూ...రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ ఖాతాలోకే చేరనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే అప్రమత్తమయ్యారని... కాంగ్రెస్ గెలిస్తే రాహుల్‌కి, బీజేపీ గెలిస్తే మోదీకి లాభమని వారు గుర్తించారన్నారు. అందువల్లే టీఆర్ఎస్ ను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు లాభం చేకూరుతుందని గుర్తించారని ఈటల తెలిపారు. అందువల్లే టీఆర్ఎస్ ను గెలిపించడానికి ప్రజలంతా సిద్ధమయ్యారని ఈటల వెల్లడించారు.
వీడియో
"