హైదరాబాద్: మహాబూబ్ నగర్  జిల్లాకు చెందిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మహాబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి స్థానంలో మన్నె శ్రీనివాస్ రెడ్డికి కేటాయించే అవకాశం ఉంది. మన్నె శ్రీనివాస్ రెడ్డి కూడ గురువారం నాడు కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

మహాబూబ్ నగర్  పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. బుధవారం నాడు రాత్రి కూడ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు.ఇవాళ రెండో సారి కూడ సమావేశం కూడ ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీకి చెందిన మన్నె శ్రీనివాస్ రెడ్డికి మహాబూబ్ నగర్ ఎంపీ టిక్కెట్టును ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. మన్నె శ్రీనివాస్ రెడ్డి కూడ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశానికి హాజరైనట్టుగా సమాచారం. జితేందర్ రెడ్డి స్థానంలో శ్రీనివాస్ రెడ్డికి ఎంపీ టిక్కెట్టును కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.