గతంలో  వీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. కొన్ని కారణాలతో ఇద్దరూ కూడ వేర్వేరు స్థానాల్లో పోటీకి దిగారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన ఇద్దరు అభ్యర్థులు ఒక్కటయ్యారు. 

హైదరాబాద్: గతంలో వీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. కొన్ని కారణాలతో ఇద్దరూ కూడ వేర్వేరు స్థానాల్లో పోటీకి దిగారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన ఇద్దరు అభ్యర్థులు ఒక్కటయ్యారు.

ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా కొనసాగుతున్నారు. కూన వెంకటేష్ గౌడ్ మాత్రం ఇటీవలనే టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జీగా కూన వెంకటేష్ ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి తాను పోటీ చేస్తానని ఆనాడు టీడీపీలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు వద్ద పట్టుబట్టాడు. దీంతో చంద్రబాబునాయుడు సనత్‌నగర్ సీటును కూన వెంకటేష్ గౌడ్‌కు కాకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేటాయించారు.

కూన వెంకటేష్‌గౌడ్‌కు సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. సికింద్రాబాద్ నుండి పోటీ చేసిన కూన వెంకటేష్ గౌడ్ టీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు చేతిలో ఓటమి పాలయ్యారు. సనత్‌నగర్ నుండి పోటీ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్ధి మర్రి శశిధర్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

2018 డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో సనత్‌నగర్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా టీడీపీ అభ్యర్ధిగా కూన వెంకటేష్ గౌడ్ పోటీ చేశారు. ఈ దఫా కూడ తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు. 

రెండు వారాల క్రితం కూన వెంకటేష్ గౌడ్ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. దీంతో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్, కూన వెంకటేష్ గౌడ్‌లు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.