హైదరాబాద్: ఈ నెల 17వ తేదీ నుండి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కరీంనగర్ జిల్లా నుండి కేసీఆర్ ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ విస్తృతంగా పాల్గొన్నారు.ఇప్పటికే రాష్ట్రంలోని 14 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను కేసీఆర్ ఫైనల్ చేసినట్టు సమాచారం.  మిగిలిన రెండు స్థానాల్లో అభ్యర్ధులను ఫైనల్ చేయాల్సి ఉంది.

ఈ నెల 17వ తేదీన కరీంనగర్ జిల్లా నుండి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఆ తర్వాత  ఈ నెల 19వ తేదీ నుండి  నిజామాబాద్‌ లో బహిరంగ సభలో పాల్గొంటారు.ఒక్కొక్క సభకు భారీగా జనాన్ని సమీకరించాలని కేసీఆర్ పార్టీ  ఎమ్మెల్యేలకు సూచించారు.

సోమవారంనాడు టీఆర్ఎస్ భవన్‌లో నిర్వహించిన ఆ పార్టీ శాసనసభపక్ష సమావేశంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్లాన్ ను కేసీఆర్ వివరించారు.