హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే  ప్రగతి భవన్‌కు చేరుకొన్నారు. 

2014 ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన ముగ్గురికి ఈ దఫా కేసీఆర్ టిక్కెట్లను నిరాకరించనున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్‌లకు టిక్కెట్లను నిరాకరించారు. వీరి స్థానంలో కొత్త అభ్యర్థులకు చాన్స్ ఇవ్వనున్నారు.

మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా జితేందర్ రెడ్డి పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి.  దీంతో జితేందర్ రెడ్డికి టిక్కెట్టును నిరాకరించినట్టుగా చెబుతున్నారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కూడ అసెంబ్లీ ఎన్నికల్లో సరిగా వ్యవహరించలేదని కేసీఆర్ అభిప్రాయంతో ఉన్నారు. అంతేకాదు ఆయన పనితీరు  పట్ల కూడ కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ స్థానంలో కవితకు ఎంపీ టిక్కెట్టు ఇవ్వనున్నారు.

మరోవైపు ఖమ్మంలో టీఆర్ఎస్ ఓటమికి పార్టీ నేతలే కారణమని కేసీఆర్  ప్రకటించారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణంగా ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో ఆయన స్థానంలో టీడీపీ నుండి ఇవాళ టీఆర్ఎస్‌లో చేరిన నామా నాగేశ్వర్ రావుకు ఖమ్మం ఎంపీ టిక్కెట్టు కేటాయించనున్నారు.

ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీకి దూరంగా ఉండనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకుగాను రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.హైద్రాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం గెలిచే అవకాశం ఉందని టీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది.

నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి సైతం కేసీఆర్ షాకిచ్చారు. ఆయన స్థానంలో నర్సింహారెడ్డిని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గుత్తా ప్రగతి భవన్‌ నుంచి వెళ్లిపోయారు.

టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే

1. నల్గొండ- వేమిరెడ్డి నర్సింహారెడ్డి
2.భువనగరి- బూర నర్సయ్య గౌడ్
3.మహబూబాబాద్-  మాలోతు కవిత
4.వరంగల్- పసునూరి దయాకర్
5.ఆదిలాబాద్- జి.నగేష్
6.నాగర్‌కర్నూల్- పి. రాములు
7. మహాబూబ్ నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి
8.పెద్దపల్లి- నేతకాని వెంకటేష్
9.ఖమ్మం-  నామా నాగేశ్వర్ రావు
10.నిజామాబాద్-  కవిత
11.కరీంనగర్- బి.వినోద్
12.మల్కాజిగిరి- మర్రి రాజశేఖర్ రెడ్డి
13.సికింద్రాబాద్- తలసాని కిరణ్ యాదవ్
14.చేవేళ్ల-  డాక్టర్ రంజిత్ రెడ్డి
15.జహీరాబాద్- బీబీపాటిల్
16. మెదక్ - కొత్త ప్రభాకర్ రెడ్డి

17. హైదరాబాద్- పుస్తె శ్రీకాంత్