శంషాబాద్: మాజీహోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శంషాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్తీక్ రెడ్డికి కండువాకప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డిని అభినందించారు. కార్తీక్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ లు కీలక నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇకపోతే కార్తీక్ రెడ్డి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం నిరంతరం పాటు పడుతోందని అందువల్లే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. 

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 16మంది అభ్యర్థులను గెలిపించాలని కోరారు.16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండా విజయకేతనం ఎగురవేస్తే ఎర్రకోటపై జెండా ఎవరు ఎగురవేస్తారో నిర్ధారించేది టీఆర్ఎస్ పార్టీయేనని కేటీఆర్ స్పష్టం చేశారు.