Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ ఎంపీ అభ్యర్థికి తీవ్ర అస్వస్థత... హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

కరీంనగర్ లోక్ సభ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు హటాత్తుగా కళ్లుతిరిగి రోడ్డుపైనే పడిపోయారు. దీంతో ఆయనవెంటున్న అనుచరులు, నాయకులు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వడదెబ్బ కారణంగానే సంజయ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. 

karimnagar bjp mp candidate bandi sanjay joined hospital
Author
Karimnagar, First Published Apr 9, 2019, 8:23 PM IST

కరీంనగర్ లోక్ సభ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు హటాత్తుగా కళ్లుతిరిగి రోడ్డుపైనే పడిపోయారు. దీంతో ఆయనవెంటున్న అనుచరులు, నాయకులు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వడదెబ్బ కారణంగానే సంజయ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం సంజయ్ కరీంనగర్ పట్టణంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డీహైడ్రేషన్ తో పాటు వడదెబ్బ తగలడం వల్లే సంజయ్ అనారోగ్యానికి గురయ్యారని... అయితే అతడికి మెరుగైన వైద్యం అందిస్తుండటంతో ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదని వెల్లడించారు. కానీ ఆయనకు కాస్త విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. 

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ఇవాళ చివరిరోజు కావడంతో బిజెపి కరీంనగర్ పట్టణంలో విజయ సంకల్ప పాదయాత్ర చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంజయ్ మద్యాహ్నం తీవ్ర ఎండలో నడక ప్రారంభించారు. ఎండ వేడికి తోడూ భారీగా కార్యకర్తలు గుమిగూడటంతో తీవ్ర ఉక్కపోత కారణంగా సంజయ్ తీవ్రంగా ఇబ్బందిపడుతూ ఒక్కసారిగా కిందపడిపోయారు. 

బండి సంజయ్ అస్వస్థత గురించి తెలుసుకున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.  తమ నాయకుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు డాక్టర్లను, ఆస్పత్రి సిబ్బందిని సంప్రదిస్తున్నారు. వారు సంజయ్ కి ప్రమాదమేమీ లేదని... ప్రస్తుతం కోలుకుంటున్నాడని చెప్పడంతో కాస్త కుదుటపడ్డారు.  
  
Follow Us:
Download App:
  • android
  • ios