తెలంగాణ రాగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన గురించి తానేం మాట్లాడనని కానీ ప్రతిపక్షం లేకుండా రాష్ట్రం మొత్తం ఒకటే పార్టీ ఉండేలా చేయడం ఏం బాలేదన్నారు.

చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయినప్పుడు మాయావతి లాంటి దళితనేత ప్రధాని ఎందుకు కాకూడదని పవన్ ప్రశ్నించారు. తన ముందే కేసీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన తలసాని, ఎర్రెబెల్లి దయాకర్ రావు నేడు ఆయన పక్కన సెటిలయ్యారని వీళ్లంతా ప్రజల కోసం పనిచేయరని, వాళ్ల కోసం పనిచేసుకునే వారని పవన్ ఎద్దేవా చేశారు. సరికొత్త తెలంగాణ రావాలంటే సరికొత్త నేతలు రావాల్సిన అవసరం ఉందన్నారు.