హైదరాబాద్: హైదరాబాద్  పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఎంఐఎం ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ పట్టున్న ఈ నియోజకవర్గం ప్రస్తుతం ఎంఐఎం చేతుల్లోకి వెళ్లింది. 1984 నుండి ఈ స్థానంలో ఎంఐఎం వరుసగా విజయం సాధిస్తోంది. 

హైద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి 1984 నుండి  ఎంఐఎం అభ్యర్ధులే విజయం సాధిస్తున్నారు. 1984లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన తనయుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

1952‌లో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి  అహ్మద్ మోహీనుద్దీన్ విజయం సాధించారు. 1957లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వినాయకరావు కొరాట్కకర్, 1962లో గోప్లయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా తొలిసారిగా ఆయన ఈ స్థానం నుండి  1962లో గెలిచారు. ఆ తర్వాత వరుసుగా మూడు దఫాలు ఆయన ఈ స్థానం నుండి విజయం సాధించారు.

1977 వరకు ఈ స్థానం గోప్లయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే విజయం సాధించారు. 1971 లో జరిగిన ఎన్నికల్లో సుబ్బుకృష్ణ టీపీఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
1977లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కేఎస్ నారాయణ, 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఆయనే ఈ స్థానం నుండి విజయం సాధించారు.

1984లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 1989లో సలావుద్దీన్ ఓవైసీ ఎంఐఎం తరపున పోటీ చేసి గెలిచారు. 1991లో కూడ సలావుద్దీన్  మరోసారి ఈ స్థానం నుండి నెగ్గారు. 1996లో కూడ మరోసారి ఆయన విజయం సాధించారు. 1998, 1999 ఎన్నికల్లో కూడ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఈ స్థానం నుండి నెగ్గారు. 

2004 ఎన్నికల్లో సలావుద్దీన్ తనయుడు అసదుద్దీన్ ఓవైసీ  ఈ స్థానం పోటీ చేసి విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో కూడ ఈ స్థానం నుండి  అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు.

వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుండి అసదుద్దీన్ ఓవైసీ మరోసారి బరిలోకి దిగనున్నారు. టీఆర్ఎస్‌కు ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో హైద్రాబాద్ మినహా మిగిలిని  16 ఎంపీ సీట్లను తాము కైవసం చేసుకొంటామని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.