తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పార్టీ విజయడంకా మోగించడానికి సిద్దంగా వుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట నియోజవకర్గాల పునర్విభజన చేపడతామని... ఈ క్రమంలో ఏర్పడే నూతన పదవులను ఇప్పుడు పార్టీలో చేరుతున్న వారికి కేటాయించి తగిన గౌరవం ఇచ్చుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ గురువారం చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చేవెళ్లను ఓ మీని ఇండియాతో పోల్చారు. హైదరాబాద్ శివారుతో కూడిన ఈ లోక్ సభ నియోజకర్గ పరిధిలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు నివసిస్తున్నారని...ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అంటూ ఎవరూ లేరని వివరించారు. కేవలం కొందరు ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇక్కడి ప్రజల మధ్య ఈ ఫీలింగ్ తీసుకువచ్చి విద్వేశాలను రెచ్చగొడుతున్నారన్నారు.
అయినా టీఆర్ఎస్ అభ్యర్థిని నాన్ లోకల్ అంటున్న జాతీయ పార్టీలు వారణాసిలో మోదీ.. మల్కాజ్‌గిరిలో రేవంత్‌రెడ్డి లోకల్ కాకున్నా ఎలా బరిలో నిలిపాయో సమాధానం చెప్పాలన్నారు. ముందు తమ గురించి తెలుసుకున్నాక ఇతర పార్టీలపై విమర్శలు చేస్తే బావుంంటుందని బిజెపి, కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ హెచ్చరించారు.
ఓవైపు ఓడిపోయిన పార్టీ అధ్యక్షుడు మరో వైపు ఓడిపోడానికి సిద్దంగా వున్న పార్టీ అధ్యక్షుడు చేసిన విమర్శలను తాము పట్టించేకోమని ఉత్తమ్, లక్ష్మణ్ లపై పరోక్ష విమర్శలకు దిగారు. దమ్ముంటే ఓటమికి నైతిక బాధ్యతగా లక్ష్మణ్, లోక్ సభ బరిలో వున్నందుకు ఉత్తమ్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీ బలం ముందు ఏపార్టీ బలం పనిచేయదని....రాష్ట్రంలోని అన్ని లోక్ సభ స్థానాలను గెలిచి తాము క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కేటీఆర్ అన్నారు.