హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు తనకు రుణం ఇవ్వాలని సామాజిక కార్యకర్త కె. వెంకటనారాయణ కెనరా బ్యాంకులో ధరఖాస్తు చేసుకొన్నాడు. 

హైద్రాబాద్‌లోని అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కె. వెంకటనారాయణ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి పోటీకి సన్నాహాలు చేసుకొంటున్నారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుండి కూడ ఆయన ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.ఈ సమయంలో తనకు అవసరమైన నిధుల కోసం వెంకటనారాయణ బిక్షాటన చేసిన విషయం తెలిసిందే.

సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి  పోటీకి వెంకటనారాయణ సిద్దమయ్యారు. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు తన వద్ద డబ్బులు లేవని ఆయన చెబుతున్నారు. వ్యాపారాలు, చదువుల నిమిత్తం  ఇచ్చినట్టుగానే  తాను పోటీ చేసేందుకు  రుణం ఇవ్వాలని  ఆయన కోరారు. అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రుణం ఇచ్చేందుకు చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.