దేశంలో ఈ దఫా బీజేపీ 300 సీట్లు గెలిస్తే కేసీఆర్, కేటీఆర్‌లు రాజకీయ సన్యాసం చేస్తారా అని మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ సవాల్ విసిరారు.
హైదరాబాద్: దేశంలో ఈ దఫా బీజేపీ 300 సీట్లు గెలిస్తే కేసీఆర్, కేటీఆర్‌లు రాజకీయ సన్యాసం చేస్తారా అని మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ సవాల్ విసిరారు.
బుధవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి ఈ దఫా వంద కంటే ఎక్కువ ఎంపీ సీట్లు దక్కవని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్న విషయంపై ఆయన స్పందించారు.
బీజేపీకి తక్కువ ఎంపీ సీట్లు వస్తాయని టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీపై కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను కేసీఆర్ మోడీకి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పెరిగిపోతోందన్నారు. కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఎవరూ కూడ గుర్తించరని దత్తాత్రేయ చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఓ అతుకుల బొంత అంటూ విమర్శించారు.
