Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌పై ఆగ్రహం: కవితపై పోటీకి 50 మంది రైతుల నామినేషన్

కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహంతో ఊగిపోతోన్న రైతులు.. లోక్‌సభ ఎన్నికలను సైతం వదిలిపెట్టడం లేదు. ప్రభుత్వం తమ ఆవేదన పట్టించుకోకపోవడంతో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి స్వయంగా రైతులే నామినేషన్లు వేస్తున్నారు. 

farmers files nominations for nizamabad lok sabha constituency
Author
Nizamabad, First Published Mar 25, 2019, 12:03 PM IST

తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు, మొక్క జోన్న రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు.

దీంతో కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహంతో ఊగిపోతోన్న రైతులు.. లోక్‌సభ ఎన్నికలను సైతం వదిలిపెట్టడం లేదు. ప్రభుత్వం తమ ఆవేదన పట్టించుకోకపోవడంతో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి స్వయంగా రైతులే నామినేషన్లు వేస్తున్నారు.

ఇప్పటి వరకు ఆ స్థానంలో దాఖలైన 56 నామినేషన్లలో 50 మంది రైతులే కావడం విశేషం. మరోవైపు నేటితో నామినేషన్ గడువు ముగుస్తుండటంతో సోమవారం ఉదయం మరికొంత మంది రైతులు నామినేషన్ దాఖలు చేసేందుకు నిజమాబాద్ కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios