నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా అన్యాయం చేసిందని అన్యాయం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ఆరోపించారు. తెలంగాణ కు ఇచ్చిన ఒక్క మంత్రి పదవిని కూడా పూర్తికాలం కొనసాగించకుండా మధ్యలోనే లాక్కున్నారని అన్నారు. ఇలా దత్తాత్రేయ నుండి మంత్రి పదవి లాక్కొని తెలంగాణ ను అవమానించారని హరీష్ పేర్కొన్నారు. 

మెదక్ లోక సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా హరీష్ ఇవాళ మిరుదొడ్డి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ పదిహేను రోజులు పార్టీ కోసం కష్టపడాలని సూచించారు. మిగతా ఐదేండ్లు మీకోసం మేము కష్టపడతామని హరీష్ కార్యకర్తలకు హామీ ఇచ్చారు.. 

ఎన్నికల ముందు మాత్రమే బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు కనిపిస్తారని...ఆ తర్వాత వారి అడ్రస్ కూడా దొరకదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు బిజెపి మీద భరోసా లేదని... అలాగని కాంగ్రెస్ మీద కూడా విశ్వాసం లేదన్నారుజ వారు కేవలం టిఆర్ఎస్ పార్టీని మాత్రమే నమ్ముతున్నారని హరీష్ తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు సాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని ఎన్నిసార్లు కోరినా స్పందించలేదని అన్నారు. అలాంటి బిజెపి పార్టీకి ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. 

దేశంలో జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న బిజెపి, కాంగ్రెస్ లు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అలాంటి  బిజెపికి  ఓటేస్తే కేవలం మోడీకి మాత్రమే లాభమని.... కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ కు మాత్రమమే లాభం చేకూరుతుందన్నారు. కానీ మన టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే యావత్ తెలంగాణ కు లాభం జరుగుతుందని హరీష్ అన్నారు.