దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు రేపు కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ విషయంపై ఎన్నికల సీఈవో రజత్ కుమార్ స్పందించారు.

‘‘ప్రతి నియోజకవర్గానికి రెండు కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 36 టేబుళ్లు ఏర్పాటు చేశాం. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర సౌకర్యాలు ఏర్పాటు చేశాం.’’ అని చెప్పారు.
 
‘‘ఐదు వీవీప్యాట్‌లు సెలెక్ట్‌ చేసి వాటిని ఈవీఎం లెక్కలతో సరిచూస్తాం. కౌంటింగ్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశాం. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభిస్తాం. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ జరుగుతుంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. వీవీప్యాట్లలో తేడా వచ్చే అవకాశం లేదు. కౌంటింగ్‌లో 6745 మంది సిబ్బంది పనిచేయనున్నారు’’ అని రజత్ కుమార్ తెలిపారు.