Asianet News TeluguAsianet News Telugu

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈసీ నోటీసులు...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగసభలో కేసీఆర్ హిందూ మతాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందే మత ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రిపై ఈసీకి  ఫిర్యాదు చేశాయి. 

election commission issued notice on kcr
Author
Hyderabad, First Published Apr 10, 2019, 2:20 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగసభలో కేసీఆర్ హిందూ మతాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందే మత ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రిపై ఈసీకి  ఫిర్యాదు చేశాయి. 

బాధ్యతాయుతమైన పదవిలో వున్న వ్యక్తి తమ మతాన్ని కించపరుస్తూ ''హిందుగాళ్ళు...బొందు గాళ్లు'' అంటూ అసభ్యకరంగా మాట్లాడారని  ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తాజాగా స్పందించిన ఈసీ కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్దంగా వున్నాయని... అందువల్ల అలా ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చిందో ఈ నెల 12వ  తేదీ వరకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందుకు సంబంధించి ఈసీ నోటీసులు కూడా జారీ చేసింది.  

లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నుండి ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సభలో ప్రధాని మోదీ, బిజెపి పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ పార్టీల మాదిరిగా కులాలు, మతాల పేరిట రాజకీయాలు చేయడం తనకు చేతకాదని అన్నారు. నిజం చెప్పాలంటే ఎప్పుడూ యాగాలు, పూజలు చేసే తానే గొప్ప హిందువునని పేర్కొన్నారు. ఈ ''హిందుగాళ్లు..బొందు గాళ్లు'' అని చెప్పుకుని ఎన్నికల్లో లబ్ధిపొందడానికి ప్రయత్నించే దరిద్రుల చేతిలో ప్రస్తుతం దేశం వుందంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

కేసీఆర్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల నియమావళిని ఉళ్లంఘించాడంటూ హిందూ ధార్మిక సంఘాలు నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ కు పిర్యాదు చేసింది.  విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, అధికార ప్రతినిది రావినూతల శశిధర్, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, భజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ ముఖేష్, సీనియర్ న్యాయవాది కరుణాసాగర్ లు ఈసిని కలిసిన వారిలో వున్నారు. వీరి పిర్యాదుపై స్పందిస్తూ తాజాగా ఈసీ ముఖ్యమంత్రిని ఈ వ్యాఖ్యలపై వివరణ కోొరింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios