తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతితో.. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ వాగ్వాదానికి దిగారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతితో.. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ వాగ్వాదానికి దిగారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో మంగళవారం విజయశాంతితో పాటు టీ. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్, నర్సారెడ్డి, రాములు నాయక్ పాల్గొన్నారు.

వీరంతా వరుసగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు....చివర్లో వీహెచ్ మాట్లాడుతుండగా ప్రసంగాన్ని త్వరగా ముగించాలని రాములమ్మ కోరారు. దీంతో హనుమంతన్న ఫైర్ అయ్యార్. విజయశాంతితో వాగ్వాదానికి దిగారు..

దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె రోడ్ షో మధ్యలోనే వెళ్లిపోయారు. చివరకు పార్టీ అభ్యర్థి అనిల్ మాట్లాడే సమయానికి జనాలు ఎవరూ లేకపోవడంతో కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా ముగించారు.