8 స్థానాలకు కాంగ్రెసు అభ్యర్థుల ఖరారు: లోకసభ బరిలో రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 8 లోకసభ స్థానాలకు కాంగ్రెసు అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. టీఆర్ఎస్ అభ్యర్థుల కన్నా ముందే కాంగ్రెసు అభ్యర్థులు ఖరారయ్యారు.
 
అభ్యర్థులు వీరే..
1. ఆదిలాబాద్ : రమేష్ రాథోడ్
2. మహబూబాబాద్ : బలరాం నాయక్
3. పెద్దపల్లి : ఎ. చంద్రశేఖర్
4. కరీంనగర్ : పొన్నం ప్రభాకర్
5.మల్కాజిగిరి : రేవంత్ రెడ్డి
6. జహీరాబాద్ : మదన్ మోహన్
7. చేవెళ్ల : కొండ విశ్వేశ్వర్ రెడ్డి
8. మెదక్ : గాలి అనిల్ కుమార్ 
 
మరో 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెసు ప్రకటించాల్సి ఉంది. నల్గొండ, ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌‌ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రోజు శనివారం రోజున సెకండ్ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.