హైదరాబాద్: రాష్ట్రంలోని  17 ఎంపీ స్థానాల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో ఎవరెవరికీ టిక్కెట్లు ఇస్తే ప్రయోజనంగా ఉంటుందనే విషయమై ఎఐసీసీకి లేఖ రాశారు. సామాజిక సమతుల్యతను పాటిస్తూనే గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇవ్వాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 


హైద్రాబాద్- ఫిరోజ్ ఖాన్

సికింద్రాబాద్ -అంజన్‌కుమార్

మహబూబాబాద్ -సీతక్క

మహబూబ్ నగర్ -డికె అరుణ

నాగర్ కర్నూల్ -నంది ఎల్లయ్య

ఖమ్మం -నామ నాగేశ్వరరావు లేదా రేణుక చౌదరి (టీడీపీతో పొత్తుంటే)

పెద్దపల్లి -కె సత్యనారాయణ

నల్గొండ- జానారెడ్డి

మల్కాజిగిరి -రేవంత్ రెడ్డి

జహీరాబాద్- షబ్బీర్ అలీ

మెదక్ -సునీతా లక్ష్మారెడ్డిలేదా దామోదర రాజనర్సింహ

వరంగల్ -అద్దంకి దయాకర్

భువనగరి -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కరీంనగర్- పొన్నం ప్రభాకర్ లేదా జీవన్ రెడ్డి

చేవేళ్ల -కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఆదిలాబాద్- రమేష్ రాథోడ్

టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏక పక్షంగా విజయం సాధించకుండా ఉండేందుకు వీలుగా తాను సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లను కేటాయించే విషయాన్ని పరిశీలించాలని  ఆ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు.