Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ లో చేరమంటూ పోలీసులే బెదిరిస్తున్నారు: ఈసీకి రేవంత్ ఫిర్యాదు

లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాధికారులు, పోలీసులు అధికార టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం పరిధిలో ఎన్నికల నిబంధనలకు అతీతంగా వ్యవహరిస్తున్న అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, నాయకులు, కార్యకర్తలపై బెదిరింపులకు దిగుతున్నట్లు రేవంత్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
congress leader revanth reddy complains to ec
Author
Hyderabad, First Published Apr 8, 2019, 4:42 PM IST

లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాధికారులు, పోలీసులు అధికార టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం పరిధిలో ఎన్నికల నిబంధనలకు అతీతంగా వ్యవహరిస్తున్న అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, నాయకులు, కార్యకర్తలపై బెదిరింపులకు దిగుతున్నట్లు రేవంత్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

రేవంత్ ఈసీకి అందించిన ఫిర్యాదులో చాలా విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా మరో రెండు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం మిగిలుండగా తాము విస్తృత ప్రచారాన్ని చేపట్టాల్సి వుందని...కానీ అందుకు అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. రాత్రి 10గంటల వరకు ప్రచారానికి అనుమతి వుండగా 7గంటలకే తమను అడ్డుకుంటూ ఇబ్బందిపెడుతున్నారని అన్నారు. కానీ అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలు మాత్రం అర్థరాత్రి వరకు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక ప్రభుత్వాధికారులు, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను టీఆర్ఎస్‌లో చేరమంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారిని... అభ్యర్థుల తరపున ప్రచారం చేపడుతున్న వారిని బెదిరిస్తున్నారని తెలిపారు. అన్ని అనుమతులున్నా ఇలా పక్షపాతంగా వ్యవహరిస్తూ పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పోలీసులు, అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. 

ఇలాంటి ఇబ్బందులు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి నియోజకవర్గంలో మరీ ఎక్కువగా వున్నాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే ఈసీ స్పందించి నిబంధనల ప్రకారం అధికారులు పనిచేసేలా చూడాలని కోరారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ప్రచారం నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలని రేవంత్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios