ఒంటరి మహిళలకు పెన్షన్ పెట్టమని తనను ఎవ్వరూ అడగలేదని కానీ.. ఇవ్వాలనుకున్నానని ఇచ్చేశానని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. 

ఒంటరి మహిళలకు పెన్షన్ పెట్టమని తనను ఎవ్వరూ అడగలేదని కానీ.. ఇవ్వాలనుకున్నానని ఇచ్చేశానని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న కేసీఆర్ ప్రసంగించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఎన్నికల సమయంలో తాము రూ.1 లక్ష రైతు రుణమాఫీ చేస్తామన్నామని, కానీ కాంగ్రెస్ వాళ్లు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ ప్రజలు టీఆర్ఎస్ వైపే నిలిచారన్నారు.

గిరిజనుల సంక్షేమం కోసమే ఈ ప్రాంతంలో నాలుగు జిల్లాలు ఏర్పాటు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. రెవెన్యూచట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. వేరే కారణాల వల్ల సీతారాంనాయక్‌కు ఈసారి టికెట్ ఇవ్వలేకపోయానని ఆయన అభిమానులు బాధపడొద్దని.. ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని కేసీఆర్ శ్రేణులకు తెలిపారు.