తాను, తన కుటుంబం కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తామని  నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సతీమణి పార్వతమ్మ ప్రకటించారు. తాను టీఆర్ఎస్‌ కోసం పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. 

నార్కట్‌పల్లి: తాను, తన కుటుంబం కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సతీమణి పార్వతమ్మ ప్రకటించారు. తాను టీఆర్ఎస్‌ కోసం పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.

బుధవారం నాడు ఆమె బ్రహ్మణవెల్లెంల గ్రామంలో మీడియాతో మాట్లాడారు. ఇవాళ తమ ఇంటి ముందు నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్తుంటే నమస్కారం చేశానని ఆమె చెప్పారు.

అదే గ్రామానికి చెందిన వాడు, తెలిసినందున ఆయనతో మాట్లాడినట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు. కానీ, ఆ సమయంలో కొందరు ఫోటోలు తీసి తాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మద్దతిస్తున్నట్టుగా ప్రచారం చేయడాన్ని ఆమె ఖండించారు.

తన భర్త అడుగుజాడల్లోనే తాను నడుస్తానని ఆమె ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం తాను కృషి చేస్తానని ఆమె ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మకుండా టీఆర్ఎస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్‌కు షాక్: ఎమ్మెల్యే చిరుమర్తి భార్య కోమటిరెడ్డి వైపు