పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ జనసేన తరఫున బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి గురువారం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొంటారు. జనసేన తెలంగాణలో సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, నిజామాబాద్‌, మహబూబాబాద్‌ స్థానాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్: తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మెగాస్టార్, మాజీ పార్లమెంటు సభ్యుడు చిరంజీవి ప్రచారం చేయనున్నారు. అయితే, ఆయన తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కోసం రంగంలోకి దిగడం లేదు. చిరంజీవి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తరఫున ప్రచారం చేయడానికి నిర్ణయించుకున్నారు. 

పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ జనసేన తరఫున బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి గురువారం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొంటారు. జనసేన తెలంగాణలో సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, నిజామాబాద్‌, మహబూబాబాద్‌ స్థానాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. 

చిరంజీవి తన బంధువు కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున ఈ నెల 8న వికారాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. చిరంజీవి ప్రచారం చేసే విషయంపై తాండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. చిరంజీవి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్‌ నేతలే. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది.