Asianet News TeluguAsianet News Telugu

తుల్జాభవాని పాదాల వద్ద నామినేషన్ పత్రాలు... చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి ప్రత్యేక పూజలు (వీడియో)

చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ కుమార్ సోమవారం నామినేషన్ వేశారు. అంతకు ముందు ఆయన శేరిలింగంపల్లి తారానగర్ లోని తుల్జాభవాని ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాలవద్ద ఉంచి తనను గెలిపించాలని అమ్మవారికి వేడుకున్నారు. 
 
chevella trs mp candidate ranjith reddy nomination programme
Author
Chevella, First Published Mar 25, 2019, 4:46 PM IST

చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ కుమార్ సోమవారం నామినేషన్ వేశారు. అంతకు ముందు ఆయన శేరిలింగంపల్లి తారానగర్ లోని తుల్జాభవాని ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాలవద్ద ఉంచి తనను గెలిపించాలని అమ్మవారికి వేడుకున్నారు. 

అక్కడి నుండి ఆయన ప్రత్యేక వాహనాల్లో రాజేంద్ర నగర్ లోని తహసిల్దార్ కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యేలు, అనుచరులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి రంజిత్ కుమార్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. 

ఈ నామినేషన్ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి‌ గాంధీ, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. ఆయన పెద్ద మెజార్టీతో అఖండ విజయం సాధిస్తారన్నారు. ఇలా గతంలో గెలుపొందిన చేవెళ్ల స్థానాన్ని మళ్లీ తామే కైవసం చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు.  

వీడియో

"

Follow Us:
Download App:
  • android
  • ios