హైదరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం పేరు చెప్పగానే మజ్లిస్‌ కంచుకోటగా గుర్తుకొస్తుంది. గత మూడు పర్యాయాయాలుగా.. మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ.. ఈ సీటును గెలుస్తూ వస్తున్నారు. మరోసారి ఈ సీటును దక్కించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ రోజు ఆయన హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పేపర్లను ఎన్నికల అధికారులకు అప్పగించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నామినేషన్ వేస్తున్న ఫోటోలను కూడా ట్విట్టర్ లో పోస్టు చేశారు.