Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల విధుల్లో.. మాతృత్వాన్ని చాటిన మహిళా సీఐ

ఎన్నికల విధులు నిర్వహిస్తూనే.. ఓ మహిళా సీఐ తన మాతృత్వాన్ని చాటుకున్న సంఘటన హుజూరాబాద్ లో చోటుచేసుకుంది.

all are praising ci madhavi for her act in polling station
Author
Hyderabad, First Published Apr 12, 2019, 3:56 PM IST

ఎన్నికల విధులు నిర్వహిస్తూనే.. ఓ మహిళా సీఐ తన మాతృత్వాన్ని చాటుకున్న సంఘటన హుజూరాబాద్ లో చోటుచేసుకుంది. ఇంతకీ మ్యాటరేంటంటే... శుక్రవారం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. తెలంగాణలో లోక్ సభ స్థానాలకు ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్న మహిళా సీఐ మాధవి చేసిన ఓ పని అక్కడివారందరినీ ఆకట్టుకుంది.

హుజారాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో పోలింగ్ జరుగుతోంది. కాగా.. ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించిందేకు సీఐ మాధవి అక్కడికి వచ్చారు. ఓటు వేసేందుకు ఓ మహిళ చిన్నారిని ఎత్తుకొని అక్కడికి వచ్చింది. ఆ క్యూలో పసిబిడ్డతో ఆమె నిల్చొని ఓటు వేయడం కష్టమని చెప్పి.. ఆ బిడ్డను సీఐ తీసుకుంది. 

బిడ్డ తల్లి ఓటువేసి వచ్చేంత వరకు బిడ్డను సీఐ లాలించింది.ఒక వైపు ఎన్నికల విధులు నిర్వహిస్తూనే.. మరో వైపు బిడ్డను లాలించింది. ఆమె చేసిన పనికి అక్కడ ఉన్న ప్రజలు, నేతలను సీఐని అభినందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios