హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గురువారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది.బరిలో ఉన్న ఆయా పార్టీల రెబెల్స్‌ను బుజ్జగించి కొన్ని చోట్ల నామినేషన్లను ఉపసంహరించేలా చేశారు.  కొన్ని చోట్ల రెబెల్స్ బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో రైతులు బరిలో నిలిచారు.

తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గాను  443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గురువారం నాడు 60 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక్కరు,  జహీరాబాద్ లో ఆరుగురు, మెదక్‌లో 8, మల్కాజిగిరిలో ఒక్కరు,  సికింద్రాబాద్‌లో ఇద్దరు, హైద్రాబాద్‌లో నలుగురు, చేవేళ్ల, నాగర్‌కర్నూల్‌లలో ఒక్కరు చొప్పున, నల్గొండలో నలుగురు, భువనగరిలో 10 మంది, వరంగల్‌లో ఆరుగురు,. మహబూబాబాద్‌లో నలుగురు,ఖమ్మంలో ఆరుగురు నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు. రాష్ట్రంలోని నిజామాబాద్ ఎంపీ స్థానంలో అత్యధికంగా 185 మంది బరిలో ఉన్నారు. 

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బరిలో ఉన్న అభ్యర్థులు వీరే

.ఆధిలాబాద్-11
పెద్దపల్లి-17
కరీంనగర్-15  
నిజామాబాద్-185 
జహీరాబాద్-12 
మెదక్-10  8
మల్కాజిగిరి-12 
సికింద్రాబాద్-28 
హైదరాబాద్-15 
చేవేళ్ల-23 
మహబూబ్‌నగర్-12
నాగర్‌కర్నూల్-11 
నల్గొండ-27, 4
భువనగిరి-13 
వరంగల్-15 
మహబూబాబాద్-14 
ఖమ్మం-23