Asianet News TeluguAsianet News Telugu

యూట్యూబ్ డెస్క్‌టాప్ కొత్త ఫీచర్

యూట్యూబ్ ఇటీవలి నెలల్లో తన డెస్క్‌టాప్ వెర్షన్ కోసం కొత్త ఫీచర్లను జోడించడానికి ప్రయత్నాలు చేస్తుంది.వీక్షకులు ఇప్పుడు వీడియోల క్యూ చేసుకోవచ్చు అలాగే యూట్యూబ్ ఛానెల్ రేకమెండషన్ మాన్యువల్‌గా సెట్ చేసుకోవచ్చు.

youtube adds new feature in desktop version
Author
Hyderabad, First Published Nov 11, 2019, 4:36 PM IST

యూట్యూబ్ యొక్క డెస్క్‌టాప్ వెర్షన్‌లో క్రొత్త ఫీచర్లను పరీక్షించిన తరువాత సంస్థ చివరకు దాని డెస్క్‌టాప్ మరియు టాబ్లెట్ హోమ్‌పేజీ కోసం కొత్త డిజైన్‌ను రూపొందించడం ప్రారంభించింది. కొత్త డిజైన్ ఇప్పుడు అధిక రిజల్యూషన్ వీడియో ప్రివ్యూలను కలిగి ఉంటుంది.

also read లింక్డ్ ఇన్ కొత్త ఫీచర్‌: ఫ్రెండ్లీ ఫ్రీలాన్సర్

వీక్షకులు ఇప్పుడు వీడియోల క్యూ చేసుకోవచ్చు అలాగే యూట్యూబ్ ఛానెల్ రేకమెండషన్ మాన్యువల్‌గా సెట్ చేసుకోవచ్చు. మొదటి పేజీలో చాలా మార్పు కనిపిస్తుంది, ఇది పెద్ద తంబ్ నేల్స్, ఒకేసారి ఎనిమిది వీడియోల ప్రివ్యూ కలిగి, పెద్ద వీడియొ టైటిల్స్  మార్చబడ్డాయి అని ఆండ్రాయిడ్ పోలీస్ నివేదిక ప్రకారం వెల్లడైంది, 

 వీడియో ప్లాట్‌ఫామ్ యొక్క అల్గోరిథం అఫెన్సివ్ వీడియోలను ఒకోసారి చూపిస్తుండటం, ఇది కంపెనీ కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్య  ఇందుకోసం వినియోగదారులు డెస్క్‌టాప్ వెర్షన్ యొక్క కొత్త ఫీచర్ ఉపయోగించి దాన్ని మార్చవచ్చు.

aslo read  సర్వీసులపై ఎఫెక్ట్ పడొద్దు.. బీఎస్ఎన్ఎల్‌కు టెలికంశాఖ అడ్వైజ్


యూట్యూబ్ కొత్త "డోంట్ రికమెండ్ ఛానెల్  " ఎంపికను డెస్క్‌టాప్‌లోకి తీసుకువస్తోంది. ఈ ఫీచర్ జూన్ లో మొబైల్ వెర్షన్‌లో ప్రారంభమైంది. వినియోగదారుడు  ఇష్టపడని యూట్యూబ్ ఛానెల్‌లను మరియు వాటి కంటెంట్‌ను ఇక చూడకుండా అనుమతిస్తుంది.టాపిక్ సెలెక్టర్ ఫీచర్‌ను కూడా యూట్యూబ్ తీసుకువస్తుంది ఇది జూన్‌లో ప్రారంభం కానుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios