చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి యానివర్సరీ సేల్  ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తన భారతీయ కస్టమర్ల కోసం ప్రత్యేక సేల్‌ను ఈ నెల 10వ తేదీన ప్రారంభించనుంది. 

ఎంఐ 4వ యానివర్సరీ సందర్భంగా ఈ సేల్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రూ.4కే షియోమీ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అందుకు గాను సేల్ జరగనున్న తేదీల్లో రోజూ సాయంత్రం 4 గంటలకు రూ.4 ఫ్లాష్ సేల్ నిర్వహిస్తారు. అందులో రెడ్‌మీ వై1, ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ 4 (55), ఎంఐ బాడీ కంపోజిషన్ స్కేల్, రెడ్‌మీ నోట్ 5 ప్రొ, రెడ్‌మీ వై2, ఎంఐ బ్యాండ్ 2 లను కేవలం రూ.4కే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది.

ఎంఐ యానివర్సరీ సేల్‌లో భాగంగా షియోమీ తన ఉత్పత్తులను చాలా తక్కువ ధరకే అందివ్వనుంది. అనేక రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు. అంతేకాకుండా సేల్ జరిగే తేదీల్లో షియోమీ వినియోగదారులు తమ తమ ఎఫ్ కోడ్స్‌ను రిడీమ్ చేసుకుని ఆ మేరకు పలు ఉత్పత్తులపై ఆఫర్లను, డిస్కౌంట్లను పొందవచ్చు.

సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే రూ.500 వరకు డిస్కౌంట్ ఇస్తారు. అలాగే పేటీఎంతో రూ.500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మొబిక్విక్‌తో కొనుగోలు చేస్తే రూ.3వేల సూపర్ క్యాష్ ఇస్తారు. ఇవే కాకుండా మరెన్నో ఆఫర్లను షియోమీ తన యానివర్సరీ సేల్‌లో అందివ్వనుంది.