- Home
- Technology
- UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
యూపీఐ ద్వారా పొరపాటున తెలియనివారికి డబ్బు పంపినా దాన్ని రద్దు చేయలేం. ఇలాంటి సమయంలో డబ్బు తిరిగి పొందడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ సమాచారం మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు.

UPI ని జాగ్రత్తగా ఉపయోగించండి
ఈ డిజిటల్ యుగంలో చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు… యావత్ ప్రపంచమే మన చేతిలో ఉన్నట్లు. సోషల్ మీడియా నుండి ఆర్థిక లావాదేవీల వరకు అన్నీ స్మార్ట్ ఫోన్ లోనే జరిగిపోతున్నాయి. యూపిఐ రాకతో బ్యాంకులకు వెళ్లడం పూర్తిగా తగ్గిపోయింది… ఆర్థిక లావాదేవీలన్నీ చాలా ఈజీగా ఫోన్ లోనే జరిగిపోతున్నాయి.
యూపీఐ, గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యాప్‌లు మన సాధారణ జీవితంలో ఓ భాగమయ్యాయి… నిత్యావసర వస్తువుగా మారిపోయాయి. ఒక్క టచ్ తో కేవలం సెకన్లలోనే డబ్బులు పంపొచ్చు… పొందవచ్చు. కరెన్సీతో పనిలేదు… డిజిటల్ కరెన్సీ చేతులు మారుతుంది కాదు కాదు ఫోన్లు మారుతుంది.
అయితే ఈ యూపిఐ యాప్స్ ఉపయోగించే సమయంలో కొన్నిసార్లు పొరపాటు జరగవచ్చు. ఒకరికి వేయాల్సిన డబ్బులు మరొకరికి వేయడం జరుగుతుంది. ఇలాంటి చిన్న పొరపాటు పెద్ద నష్టానికి దారితీయొచ్చు.
యూపిఐ పేమెంట్ సమయంలో పొరపాటు వద్దు...
తొందరపాటులో తప్పుడు నంబర్ ఎంటర్ చేయడం వల్ల తెలియని వారికి డబ్బు వెళ్తుంది… వాళ్లు ఎవరో కూడా మనకు తెలియదు. కానీ యూపీఐలో ఒక్కసారి డబ్బు పంపితే దాన్ని రద్దు చేయడం కుదరదు. ఇలా చాలామంది డబ్బులు పోగొట్టుకుంటుంటారు.
అపరిచితులకు పేమెంట్ చేస్తే ఏం చేయాలి...
పొరపాటున డబ్బు పంపితే ముందుగా ఆ వ్యక్తిని సంప్రదించాలి. వారు డబ్బు తిరిగి ఇవ్వకపోతే, వెంటనే పేమెంట్ యాప్‌లో 'సమస్యను నివేదించండి' ఆప్షన్‌తో ఫిర్యాదు చేయాలి.
ఈ నెంబర్ కు కాల్ చేయండి
ఆ తర్వాత మీ బ్యాంకుకు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. పరిష్కారం దొరకకపోతే NPCI డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం ద్వారా 1800-120-1740 టోల్-ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు.
NPCI నిబంధనలివే
NPCI నిబంధనల ప్రకారం నెలలో 10 సార్లు మాత్రమే తప్పుగా పంపిన డబ్బును తిరిగి పొందడానికి ప్రయత్నించవచ్చు. అదే వ్యక్తికి 5 సార్ల కన్నా ఎక్కువసార్లు తప్పుగా పంపితే డబ్బు తిరిగి రాదు.
యూపిఐ పేమెంట్స్ సమయంలో జాగ్రత్త...
అందుకే యూపీఐ పేమెంట్ చేసే ముందు పేరు, మొబైల్ నంబర్, మొత్తాన్ని రెండుసార్లు సరిచూసుకోవాలి. ఒక్క నిమిషం ఏకాగ్రత మీ డబ్బును కాపాడుతుంది. ఏమరపాటు ఖర్చుగా మారకూడదు!

