బీజింగ్: చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ భారీ ఎత్తున కొత్త డివైజ్​ల ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈ నెల ఐదో తేదీన చైనాలో జరగనున్న ఓ భారీ కార్యక్రమంలో ఐదు ఎలక్ట్రానిక్​ పరికరాలను ఒకేసారి విడుదల చేయనుంది షియోమీ.

తొలిసారి 108 మెగా పిక్సెల్స్​ కెమెరాతో.. ఎంఐ సీసీ9 ప్రో స్మార్ట్​ఫోన్​ను తేనున్నట్లు షియోమీ ఇప్పటికే ప్రకటించింది. షియోమీ తలపెట్టిన మెగా ఈవెంట్​లో ఈ కొత్త మోడల్​ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

also read ఐదేళ్లలో 3,427 బ్యాంకుల... మూసివేత...ఎందుకంటే...?

షియోమీ మెగా ఈవెంట్​లో.. ఎంఐ 5 రేంజ్​ స్మార్ట్​ టీవీని ఆవిష్కరించనుంది. ఇప్పటి వరకు షియోమీ ఎంఐ 4 రేంజ్​లో.. పలు స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆవిష్కరించే ఎంఐ 5 టీవీల్లో సరికొత్త ఫీచర్లు జోడించినట్లు తెలుస్తోంది.

తొలిసారి షియోమీ క్యూఎల్ఈడీ ఫీచర్​తో ఎంఐ 5 రేంజ్ టీవీని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఈ మోడల్​.. 12ఎన్​ఎం ప్రాసెసర్​తో, 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ రామ్ సామర్థ్యంతో పని చేయనున్నది. దీని ధర, ఇతర కీలక ఫీచర్లు ఈ నెల 5వ తేదీన జరిగే మెగా ఈవెంట్​లో తెలియజేయనున్నది షియోమీ.

also read దేశంలో ఇంత బంగారం ఉందా!

ఆపిల్ స్మార్ట్​వాచ్ తరహాలోనే షియోమీ కూడా తొలిసారి ఎంఐ స్మార్ట్​వాచ్​ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ స్మార్ట్​వాచ్ ఎంఐయూఐ ఓఎస్​ ఆధారంగా పని చేస్తుందని షియోమీ ఇప్పటికే ప్రకటించింది. 

నాటి నుంచి షియోమీ స్మార్ట్ వాచ్​పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీని ధర సహా ఇతర వివరాలు తెలియాలంటే ఈ నెల 5 వరకు ఆగాల్సిందే. ఈ మెగా ఈవెంట్​లో ఎంఐ పవర్ బ్యాంక్3, ఎంఐ ఎయిర్ ​ప్యూరిఫైర్​ మ్యాక్స్ కొనసాగింపు వెర్షన్​ను ఆవిష్కరించనుంది షియోమీ.