దేశంలో ఇంత బంగారం ఉందా!

భారతదేశంలో 618.2 టన్నుల పుత్తడి నిల్వలు ఉన్నాయి. ఇది అంతర్జాతీయంగా వివిధ దేశాలతో పోలిస్తే 6.9 శాతం. అమెరికాలో అత్యధికంగా 8133.5 టన్నుల నిల్వలు ఉంటే, జర్మనీలో 3366 టన్నులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద 2814 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. 
 

India has 10th largest gold reserves in the world, reveals World Gold Council data

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతున్నది. ఈ గండం నుంచి గట్టెక్కెడానికి భారత్ తన వద్దనున్న గోల్డ్ రిజర్వులను అమ్మేస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో అసలు భారతదేశం వద్ద ఎంత పుత్తడి నిల్వలు ఉండొచ్చుననే విషయం ఆసక్తికరంగా మారింది. 

ప్రపంచంలోనే 10వ అతిపెద్ద పసిడి నిల్వలు గల దేశం భారత దేశం అని ప్రపంచ పుత్తడి మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. డబ్ల్యూజీసీ డేటా ప్రకారం ఇండియాలో 618.2 టన్నుల గోల్డ్‌‌ రిజర్వ్‌‌లు ఉన్నాయి. మొత్తం విదేశీ సంస్థల నిల్వలతో పోలిస్తే మనదేశ  గోల్డ్ రిజర్వ్‌‌ షేరు 6.9 శాతమని డబ్ల్యూజీసీ పేర్కొంది.

8,133.5 టన్నుల గోల్డ్ రిజర్వ్‌‌లతో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అమెరికా ఉంది. దాని తర్వాత జర్మనీ వద్ద 3,366 టన్నుల, ఐఎంఎఫ్‌‌(ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) వద్ద 2,814 టన్నుల, ఇటలీలో 2,451.8 టన్నులుగా ఉంది. 

also read చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు

ఫ్రాన్స్‌‌లో 2,436 టన్నుల, రష్యా ఫెడరేషన్‌‌లో 2,241.9 టన్నుల, చైనాలో 1,948.3 టన్నుల, స్విట్జర్లాండ్‌‌లో 1,040 టన్నుల, జపాన్‌‌లో 765.2 టన్నుల గోల్డ్ రిజర్వ్‌‌లు ఉన్నాయి. గ్లోబల్‌‌గా హోల్‌‌సేల్‌‌గా జరిగే గోల్డ్ ట్రేడ్‌‌ను ఇది అనలైజ్ చేసి, వరల్డ్‌‌ గోల్డ్‌‌ కౌన్సిల్‌‌ ట్రాక్ చేస్తూ ఉంటుంది.

India has 10th largest gold reserves in the world, reveals World Gold Council data

జూలై నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌బీఐ) గోల్డ్ ట్రేడింగ్‌‌లో యాక్టివ్‌‌గా పాల్గొంటుందని రిపోర్ట్‌‌లు వచ్చాయి. ఈ కాలంలో ఆర్‌‌‌‌బీఐ 5.1 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్‌‌ను కొనుగోలు చేసిందని, 1.15 బిలియన్ డాలర్ల గోల్డ్‌‌ను అమ్మిందని తెలిపాయి.  కానీ సెంట్రల్ బ్యాంక్ గోల్డ్‌‌ను అమ్ముతున్నట్లు వచ్చిన వార్తలను ఆర్బీఐ కొట్టివేసింది. 

also read ధంతెరాస్ వేళ ....మెరవని బంగారం...

ఆర్‌‌‌‌బీఐ ఎలాంటి గోల్డ్‌‌ను అమ్మడంలేదని, ట్రేడ్ చేయడం లేదని పేర్కొంది. అంతర్జాతీయ ధరలు, ఎక్స్చేంజ్ రేట్లకు అనుగుణంగా బంగారం విలువ మారుతూ ఉందని ఆర్‌‌‌‌బీఐ వివరణ ఇచ్చింది. 

గత నెల 18 నాటికి 27 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ రిజర్వ్‌‌లు ఆర్బీఐ వద్ద ఉన్నట్టు పేర్కొంది. 2009లో ఐఎంఎఫ్ నుంచి 200 టన్నుల గోల్డ్‌‌ను ఆర్బీఐ కొనుగోలు చేసింది. ఇదే అతిపెద్ద కొనుగోలు.

అప్పట్లో ఐఎంఎఫ్‌‌  తన వద్ద ఉన్న రిజర్వ్‌‌లో మూడో వంతు లేదా 403.3 టన్నుల గోల్డ్‌‌ను అమ్మింది. అమెరికా వద్దనున్న మొత్తం ఫారిన్ రిజర్వ్‌‌ల్లో 76.9 శాతం గోల్డ్‌‌గానే ఉంది. మొత్తం ఫారిన్ రిజర్వ్‌‌ల్లో జర్మనీలో 73 శాతం, ఇటలీలో 68.4 శాతం, ఫ్రాన్స్‌‌లో 62.9 శాతం గోల్డ్ రిజర్వ్‌‌లు ఉన్నాయి. వాటితో పోలిస్తే.. ఇండియా వద్దనున్న మొత్తం రిజర్వ్‌‌ల్లో గోల్డ్ శాతం కేవలం 6.9 శాతంగానే ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios