బీవేర్ ఆన్ వాట్సాప్: వాట్సాప్ గ్రూపు అడ్మిన్ బీ అలర్ట్
వాట్సాప్ గ్రూపులకు అనుమానాస్పద పేర్లు పెడితే అందులో సభ్యుల ఖాతాలన్నీ ఆ సంస్థ నిలిపివేస్తుంది. కాబట్టి పేర్లు పెట్టడంలోనూ, మార్చుకోవడంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వాడతారు. దీంతో చాటింగ్ మాత్రమే కాక ఆడియో, వీడియో కాల్స్ తో ఎంతో మందికి చేరువైంది వాట్సప్. రోజురోజుకు వాడే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ యాప్ దుర్వినియోగం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
దీన్ని నియంత్రించడానికి ఏడాది కాలంగా వాట్సప్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఏదైనా వాట్సప్ గ్రూప్ పేరు గానీ, ఐకాన్ గానీ చట్ట విరుద్ధంగా ఉన్నట్లయితే ముందస్తు సమాచారం లేకుండా సదరు గ్రూప్, అందులో సభ్యులను వాట్సప్ వినియోగించకుండా నిషేధించనున్నది.
aslo read 4 రోజుల్లోనే గుడ్ రెస్పాన్స్: 60 వేలు దాటిన వీఆర్‌ఎస్
అమెరికా యూనివర్సిటీకి చెందిన వ్యక్తి సభ్యుడిగా ఉన్న వాట్సప్ గ్రూప్ పేరును పిల్లలపై లైంగిక వేధింపుల అర్థం వచ్చేలా గ్రూప్ సభ్యుడొకరు మార్చారు. దాని వల్ల వాట్సప్ గ్రూప్, అందులోని సభ్యులందరినీ సస్పెండ్ చేసింది సంస్థ. నిబంధనలను అతిక్రమించారనే కారణంతో వారిపై నిషేధం విధించామని వాట్సప్ పేర్కొంది.
వారం తర్వాత ఏ సమాచారం లేకుండానే తిరిగి ఆ గ్రూప్ పునరుద్ధరించింది. 50 మంది సభ్యులు ఉన్న మరో వాట్సప్ గ్రూప్ పేరు డిస్గస్టింగ్’గా మార్చారు. మార్చిన కొన్ని గంటల్లో ఆ సభ్యులందరినీ నిషేధిస్తూ వాట్సప్ నిర్ణయం తీసుకున్నది. 27 రోజుల తర్వాత ఆ సభ్యుల ఖాతాలను పునరుద్ధరించిందని మరో యూజర్ తెలిపారు.
ఈ నిషేధ ప్రక్రియ ఆటోమేటెడ్ ప్రాసెస్ అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మెటా డేటా ద్వారా వాట్సప్ గ్రూప్ ఐకాన్, పేరు ఆధారంగా సర్వర్ వాటిని ఆటోమేటిక్ గా తొలిగించేస్తుందని తెలుస్తున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
aslo read 47 మెగాపిక్సెల్ సెన్సార్‌తో... మిర్రర్‌లెస్ కెమెరా
వాట్సప్ లో ఎండ్-టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ వల్ల అవాస్తవాలు, ద్వేషపూరిత వార్తలు వ్యాపింపజేసే గ్రూపుల మధ్య సంభాషణలు గుర్తించడం చాలా కష్టం. అటువంటి చట్ట విరుద్ద గ్రూపులను గుర్తించడానికి వాట్సాప్ ఈ తరహా విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
గ్రూపులోని ఒక సభ్యుడి వల్ల మొత్తం సభ్యులంతా నిషేధానికి గురవుతుండటం గమనార్హం. కనుక మీరు అడ్మిన్లుగా వాట్సప్ గ్రూప్ పేర్లు గానీ, ఐకాన్లు గానీ చట్ట విరుద్ధంగా ఉంటే వెంటనే మార్చేసుకోండి. లేదంటే వాట్సాప్ నిషేధానికి గురి కావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.