లైకా 2015 లో ప్రారంభించిన ఎస్ఎల్ మిర్రర్‌లెస్ కెమెరాకు కొత్త మోడల్ని విడుదల చేసింది, దీనిని లైకా ఎస్‌ఎల్ 2 అని పిలుస్తారు. దీనిలో తేమను నిరోదించడాని కోసం IP54 సర్టిఫికేషన్‌తో మెరుగైన ఎర్గోనామిక్స్‌ను కలిగి ఉంది.

ఇది 5k వీడియో వరకు షూట్ చేయగలదు మరియు  ఎలక్ట్రానిక్ షట్టర్ ఉపయోగించి 20fps వద్ద చిత్రాలని బస్ట్ షూట్ చేయగలదు. లైకా ఎస్‌ఎల్ 2 నవంబర్ 21 నుండి అందుబాటులోకి వస్తుంది. దీని ధర 5,995 $ (సుమారు రూ.4,25,700) .

also read  ఛార్జింగ్ లేకుండా సోలార్ శక్తితో నడిచే స్మార్ట్‌వాచ్‌....

లైకా ఎస్‌ఎల్ 2 లో 47 మెగాపిక్సెల్, పూర్తి-ఫ్రేమ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది మాస్ట్రో III ఇమేజ్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది మిర్రర్‌లెస్ కెమెరా కాబట్టి దీని బాడి చాలా స్లిమ్‌గా ఉంటుంది. మెరుగైన ఎర్గోనామిక్స్, మెరుగైన పట్టుతో కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఇది మల్టీ-షాట్ మోడ్‌తో పాటు ఇన్-బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కలిగి ఉంటుంది. ఇది ట్రై పాడ్ పై ఉంచినప్పుడు వరుసగా ఎనిమిది ఫ్రేమ్‌లను రికార్డ్ చేయగలదు. ఇక్కడ సెన్సార్ ప్రతి ఎక్స్‌పోజర్ మధ్య హాఫ్ పిక్సెల్ ఇంక్రిమెంట్‌లో మార్చబడుతుంది.

ఇది మరింత క్లియర్ ఫోటోస్ కోసం SL2 ను ఎనేబుల్ చేస్తుంది. A7R III లోని సోనీ యొక్క పిక్సెల్ షిఫ్ట్ ఫీచర్ వంటి టెక్నాలజి లాగా పనిచేస్తుంది.ఎస్ఎల్ 2 దాని ముందు మోడల్స్ మాదిరిగానే సైజ్, బరువు ఉంటుంది. ఇందులో ఎల్ బయోనెట్ లెన్స్ మౌంట్ కలిగి ఉంది, ఇది SL, TL లెన్స్‌లకు అనుకూలంగా ఉంటుంది.

also read రెండు వారాల బ్యాటరీ బ్యాక్అప్ తో హైబ్రిడ్ స్మార్ట్‌వాచ్

ఇది మెకానికల్ షట్టర్ ఉపయోగించి 10fps, ఎలక్ట్రానిక్ షట్టర్‌తో 20fps వరకు బస్ట్ ఫోటోలను షూట్ చేయగలదు. ఇది రెండు SD కార్డ్ స్లాట్‌లను కలిగి ఉంటుంది. రెండూ UHD-II స్పీడ్ మెమరీ కార్డులను అంగీకరించగలదు. లైకా ఎస్‌ఎల్ 2 లోని ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ 5.76 మిలియన్ డాట్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది.

వెనుక పెద్ద టచ్‌స్క్రీన్ , 3.2 అంగుళాల వద్ద 2.1 మిలియన్ డాట్ రిజల్యూషన్.లైకా SL2 సెన్సార్ యొక్క పూర్తి వెడల్పును ఉపయోగించి 60fps వరకు DCI 4K షూటింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 4K స్ట్రీమ్‌లను 10-బిట్ 4: 2: 2 వద్ద ఎక్స్ టర్నల్ రికార్డర్‌కు అవుట్ పుట్ చేయగలదు. మీకు యుఎస్‌బి టైప్-సి పోర్ట్, బ్లూటూత్, వై-ఫై కూడా ఇందులో లభిస్తాయి, దీన్ని స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా రిమోట్‌గా కంట్రోల్ చేయవచ్చు.