వాట్సాప్ లో కొత్త సెట్టింగ్  గ్రూప్ ఇన్విటేషన్ ను  ప్రవేశపెట్టింది.  ఇది వినియోగదారులకు వారు స్వీకరించే గ్రూప్ మెసేజ్ లపై మరింత నియంత్రణను కలిగిస్తుంది. గ్రూప్ లో ఎవరుని చేర్చవచ్చనే దానిపై మరింత నియంత్రణను కోరుకుంటున్నట్లుగా, అనేక మంది వినియోగదారుల అభిప్రాయాన్ని తెలుసుకున్న తరువాత ఈ ఫిచర్ ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది.

వాట్సాప్  సంస్థ ప్రకారం, గ్రూప్ ల ద్వారా వ్యాపించే అవాంఛిత సందేశాలను రాకుండా నిరోధించడానికి ఇది వారికి సహాయపడుతుంది. ఇది వైరల్ సమాచారాన్ని కలిగి ఉన్న సందేశాలని పంపించే గ్రూప్  సభ్యులను నియంత్రించవచ్చు.  

also read అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్, సిరిని 'లైట్' సిగ్నల్స్ తో హ్యాక్ చేయవచ్చు.....

ఈ  ఫీచర్‌ను ప్రారంభించడానికి వినియోగదారులు సెట్టింగ్‌లు> ఖాతా> ప్రైవసీ> లోకి వెళ్ళవచ్చు. అక్కడ వారు “ప్రతి ఒక్కరూ”, “మై కాంటాక్ట్స్” లేదా ““మై కాంటాక్ట్స్  ఏక్సెప్ట్” అనే మూడు ఎంపికలలో ఒక దానిని  ఎంచుకోవచ్చు.

'యెవ్రివాన్' సెట్టింగ్ ఏ యూజర్ అయినా వారు కోరుకున్న ఏ గ్రూప్ లోనైనా వారిని చేర్చడానికి అనుమతిస్తుంది, 'మై కాంటాక్ట్స్' సెట్టింగ్ వారి కాంటాక్ట్స్ లోని వ్యక్తులను  గ్రుపుకు చేర్చడానికి మాత్రమే అనుమతిస్తుంది. అయితే, 'మై కాంటాక్ట్స్  ఏక్సెప్ట్' సెట్టింగ్  వారు కోరుకున్న కొందరు స్నేహితులను ఎంచుకోవడానికి మరింత నియంత్రణ ఇస్తుంది.

also read సెర్చింజన్‌తో ఇలా మీ గుట్టుమట్లు ఫుల్ సేఫ్

ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టడంతో, మిమ్మల్ని గ్రూపులకు చేర్చడానికి గ్రూప్ అడ్మిన్ మిమ్మల్ని ప్రయత్నిస్తుంటే, వారు మీకు వ్యక్తిగత చాట్ ద్వారా ప్రైవేట్ ఆహ్వానాన్ని పంపి దాని ద్వారా మీరు  గ్రూప్ లో చేరడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.  మీకు ఆహ్వానం పంపినప్పటి నుండి మూడు రోజుల వరకు ఆ ఇన్విటేషన్ ఉంటుంది, ఆ తర్వాత దాని గడువు ముగుస్తుంది.


ఈ కొత్త ఫీచర్ ఈ రోజు కొంతమంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని, రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచర్ ఈ సంవత్సరం ప్రారంభంలో చాటింగ్ యాప్ యొక్క బెటా బిల్డ్‌లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరినీ నిరోధించే ఎంపికతో, అయితే, పరీక్షించిన తర్వాత, సంస్థ దీన్ని ‘నా పరిచయాలు మినహా’ గా మార్చింది.