న్యూఢిల్లీ: ప్రపంచానికి ఎన్ని సౌకర్యాలు అందించినా గూగుల్ వచ్చిన తరవాత నిత్య జీవితంలో ప్రైవసీ పోయిందని ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఎంతో బాధపడుతున్నారు. మనం ఇంటర్నెట్‌లో ఏమేం చూశామో బ్రౌజర్‌ ద్వారా ఈజీగా తెలిసిపోతాయి. మనం ఎక్కడెక్కడ తిరిగినా, ఎటెళ్లి ఎటొచ్చినా... మన ఫోన్ లోని గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ఆ ప్రయాణాలన్నీ ట్రాక్‌ అయి, గూగుల్‌ అకౌంట్లో రికార్డ్‌ అవుతాయి. ఇది నిజానికి భద్రతాపరంగా చాలా ప్రమాదకరమైన అంశం. 

మనం ఎక్కడ తిరిగినా గూగుల్ మ్యాప్స్ లో మన అడుగుజాడలు మొత్తం రిజిస్టర్‌ కావడమంటే.. మన జీవితం మొత్తాన్ని మరొకరు పర్యవేక్షిస్తున్నట్టే! మరి సౌకర్యాల మాటున దాగి ఉన్న ఇలాంటి అభధ్రమైన అంశాల నుంచి మన ప్రైవసీని కాపాడుకోవడం ఎలా? అన్న అంశంపైనే ప్రపంచమంతా ఆందోళనకు గురవుతున్నది. ఇందుకోసమే గూగుల్‌ ఇప్పుడు ఓ కొత్త ఫీచర్‌తో ముందుకొస్తోంది.

also read కాగ్నిజెంట్ తర్వాత ఇన్ఫోసిస్ వంతు.. 13 వేల కొలువులు గోవిందా
 
ఇన్‌కాగ్నిటో మోడ్‌ అనే ఫీచర్‌ను ఇప్పుడు గూగుల్‌ మ్యాప్స్ లో ప్రవేశపెడుతోంది. నిజానికి ఈ ఇన్‌కాగ్నిటో అనేది గూగుల్‌ బ్రౌజర్‌ క్రోమ్‌లో ఉన్న ఫీచరే. బ్రౌజర్‌ ద్వారా మనం చేసే పనుల్ని ట్రాక్‌ చేయకూడదనుకున్నప్పుడు - మనం బ్రౌజర్‌ని ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉంచుతాం. ఇప్పుడు మ్యాప్స్‌లోనూ ఈ మోడ్‌ అడుగుపెట్టనున్నది.

ఈ మోడ్‌లో ఉంటే - గూగుల్‌ మ్యాప్స్‌లో మన యాక్షన్స్‌ అన్నీ రహస్యంగా ఉంటాయి. అంటే మనం ఏ ప్రదేశాలు సెర్చ్‌ చేశాం, వేటికి గెట్‌ డైరెక్షన్స్ అని కొట్టి రూట్లు తెలుసుకున్నామన్న విషయం ఇన్‌కాగ్నిటో మోడ్‌లో గూగుల్‌ మ్యాప్స్‌తో మనం చేసే పనులేవీ గూగుల్‌ అకౌంట్లో సేవ్‌ కావు.

ఈ ఫీచర్‌ని యూజర్ల వ్యక్తిగత భధ్రతకి ప్రాధాన్యం ఇచ్చే గొప్ప విషయంగా చెబుతూ - గూగుల్‌ త్వరలో ఈ మోడ్‌ని మ్యాప్స్‌లో ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. దాదాపు మే నెలలోనే తొలిసారి తన ట్విట్టర్ అకౌంట్లో గూగుల్‌ ఈ విషయాలు తెలియజేసినా ప్రస్తుతం ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.

also read మెరుగైన స్లిమ్ డిజైన్‌తో ఏంఐ టీవీ 5 వచ్చేస్తుంది
 
ఈ ఇన్‌కాగ్నిటో మోడ్‌ని ఎనేబుల్‌ చేయడం డిజేబుల్ చేయడం పెద్ద కష్టమైన విషయం కాదు. గూగుల్ మ్యాప్స్‌ యాప్‌ని ఓపెన్ చేసి, అక్కడ కుడి పక్క పై భాగంలో ఉండే మన ఎకౌంట్‌ ప్రొఫైల్‌ ఇమేజ్‌ మీద క్లిక్ చేస్తే అక్కడ ‘టర్న్ ఆన్ ఇన్ కాగ్నిటో మోడ్’  అనే ఒక ఆప్షన్ ఉంటుంది.

టర్న్ ఆన్ ఇన్ కాగ్నిటో మోడ్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్‌ చేసుకోవచ్చు. ఆఫ్‌ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ వ్యక్తిగత కాపాడుకోవచ్చు - అని గూగుల్‌ చెబుతోంది. నిజమే.. మన నిత్యజీవన కార్యక్రమాలు, ప్రయాణాలు, గుట్టుమట్లు అన్నీ గూగుల్‌ చేతిలో పెట్టాల్సిన పని లేకుండా - ఇలాంటి మరిన్ని ప్రైవసీ ఆప్షన్లని గూగుల్‌ కల్పించాల్సిన అవసరం ఉంది.