Asianet News TeluguAsianet News Telugu

వోడాఫోన్ రెడ్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్:20వేల వరకు బెనెఫిట్స్

వొడాఫోన్ రెడ్‌ఎక్స్   ప్రీ-బుకింగ్ వోడాఫోన్ ఇండియా వెబ్‌సైట్, మై వోడాఫోన్ యాప్ ద్వారా అందుబాటులో ఉంది. ఇది కనీసం ఆరు నెలల చెల్లుబాటు కాలంతో వస్తుంది.వోడాఫోన్ రెడ్‌ఎక్స్ ప్లాన్ 50 శాతం వేగవంతమైన డేటా వేగాన్ని అందిస్తుందని పేర్కొంది. 

Vodafone RedX Limited Edition Postpaid Plan
Author
Hyderabad, First Published Nov 8, 2019, 3:49 PM IST

వోడాఫోన్, ఐడియా గురువారం వోడాఫోన్ రెడ్‌ఎక్స్‌ను తన లిమిటెడ్ ఎడిషన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ను విడుదల చేసింది. ఇది నెలవారీ ఛార్జీగా రూ. 999, వోడాఫోన్ రెడ్‌ఎక్స్ ప్లాన్ 50 శాతం వేగవంతమైన డేటా వేగాన్ని అందిస్తుందని పేర్కొంది.

అలాగే ఈ ఆఫర్ లో రూ. 20,000 వరకు బెనెఫిట్స్ పొందుతారు. వీటిలో అంతర్జాతీయ రోమింగ్ సేవలు, ప్రీమియం కస్టమర్ సేవ, విమానాశ్రయ లాంజ్ లకు యాక్సెస్ ఇంకా స్మార్ట్ ఫోన్ లలో ప్రత్యేకమైన ఆఫర్లు  ఉన్నాయి. ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా యాక్సెస్, 100 SMS సందేశాలు వంటి ప్రాథమిక ప్రయోజనాలు ఉన్నాయి.

aslo read ఛార్జింగ్ లేకుండా సోలార్ శక్తితో నడిచే స్మార్ట్‌వాచ్‌....

వోడాఫోన్ రెడ్‌ఎక్స్ ప్లాన్ ప్రస్తుతం ఉన్న వోడాఫోన్ రెడ్ ప్లాన్‌లతో పాటు ఉంటుంది.వోడాఫోన్ రెడ్‌ఎక్స్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్, జీ 5, వొడాఫోన్ ప్లే యొక్క యేడాది పాటు ఆఫర్ కూడ ఉంటుంది. కొత్త వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఎంచుకున్నప్పుడు కస్టమర్లు ఏడు రోజుల పాటు ఐ-రోమ్ ప్యాక్ ను రూ.  2,999 ఉచితంగా ఆఫర్ చేస్తుంది.

అంతేకాకుండా ప్రయాణికులకు భారతదేశం మరియు విదేశాలలో దేశీయ మరియు అంతర్జాతీయ విమానాశ్రయాలలో త్రైమాసికంలో ఒక యాక్సెస్ చొప్పున నాలుగు విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌ను అందిస్తామని టెల్కో పేర్కొంది.

ప్రయాణికుల కోసం వొడాఫోన్ రెడ్‌ఎక్స్ అదనంగా హోటల్స్.కామ్ ద్వారా హోటల్ బుకింగ్‌లపై ఫ్లాట్ 15 శాతం తగ్గింపును అందిస్తుంది. ఆకర్షణీయమైన ప్రదేశాల కోసం టికెట్ బుకింగ్‌పై 10 శాతం తగ్గింపు కూడా ఉంది. అదేవిధంగా వినియోగదారులు జనవరి 31, 2020 వరకు ఐదు శాతం అదనపు తగ్గింపును పొందవచ్చు.

Vodafone RedX Limited Edition Postpaid Plan

శామ్సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో లభ్యమయ్యే ఎంపిక చేసిన శామ్‌సంగ్ ఫోన్‌లపై వోడాఫోన్ రెడ్‌ఎక్స్ వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపులను అందిస్తుంది. ఈ ఆఫర్ ప్రతి ఆరునెలల వరకు వినియోగదారులకు గరిష్టంగా రెండు కొనుగోళ్లకు చెల్లుతుంది.

సాధారణ ప్రయోజనాల విషయానికొస్తే వోడాఫోన్ రెడ్‌ఎక్స్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అపరిమిత లోకల్ మరియు ఎస్‌టిడి వాయిస్ కాల్‌లతో పాటు ఐఎస్‌డి కాల్‌ నిమిషానికి 50 పైసల చొప్పున డిస్కౌంట్ ఇస్తుంది. రోజుకు 100 లోకల్, నేషనల్ మరియు రోమింగ్ SMS సందేశాలతో పాటు నెలకు 150GB FUP పరిమితితో అపరిమిత డేటా కూడా ఉన్నాయి.

ఇతర పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల కంటే 50 శాతం అధిక డేటా వేగాన్ని అందిస్తుందని టెల్కో పేర్కొంది. వోడాఫోన్ రెడ్‌ఎక్స్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రస్తుతం ఉన్న వోడాఫోన్ రెడ్ ప్లాన్‌లతో పాటు అందుబాటులో ఉంది. వినియోగదారులు వొడాఫోన్ ఇండియా వెబ్‌సైట్ లేదా మై వోడాఫోన్ యాప్ ద్వారా కొత్త ప్లాన్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

also read సౌత్ ఇండియన్ మూవీస్ ఆఫర్....జియో యూసర్స్ కి మాత్రమే


అందుబాటులో ఉన్న నిబంధనలు మరియు షరతుల ప్రకారం, రెడ్‌ఎక్స్ ప్లాన్ "పరిమిత కస్టమర్ల కోసం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా "బుకింగ్ ఉంటాయని వోడాఫోన్ ఇండియా సైట్‌లో తెలిపింది .  క్రొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రీ-బుక్ చేసే వినియోగదారులు తరువాత వారి  బుకింగ్ రద్దు చేయలేరు.

అదేవిధంగా, వోడాఫోన్ రెడ్‌ఎక్స్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కోసం కనీస కాల వ్యవధి ఆరు నెలల. కంపనీ తమ పేజ్ లో తెలిపిన నియమ, నిబంధనల ప్రకారం  ఎవరైనా ఈ ప్లాన్ ఎంచుకున్న తరువాత తిరిగి ఈ ప్లాన్ నుండి వైదొలగాలంటే రూ. 3000 వరకు అదనంగా చార్జ్ చేయబడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios