జియో సినిమా,  స్ట్రీమింగ్ సర్వీస్ సన్ ఎన్ఎక్స్ టితో భాగస్వామ్యం కలిగి ఉంది -  సన్ టివి నెట్‌వర్క్ చెన్నై ప్రధాన కార్యాలయం యాజమాన్యంలో ఉంది. తమిళ, తెలుగు, మలయాళం, మరియు కన్నడ భాషా సినిమాల సేకరణను ఒకే చోటుకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది.

వేలాది దక్షిణ భారత సినిమాలు ఆండ్రాయిడ్, ఐఓఎస్ జియో సినిమా యాప్ ద్వారా ఇప్పుడు జియో చందాదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ భాగస్వామ్యం కొద్ది రోజుల క్రితం అమల్లోకి వచ్చిందని రిలయన్స్ జియో  గాడ్జెట్స్ 360 కి తెలిపింది.

aslo read 8,200mAh బ్యాటరీతో LG జి ప్యాడ్ 5....ధర ఎంతో తెలుసా ?

జియో సినిమా మరియు Sun NXT ల మధ్య కొత్త ఒప్పందం టీవీ షోలను కవర్ చేస్తుందా లేదా అనే దానిపై ఇంకా సమాచారం లేదు. సన్ టీవీ యొక్క బొకెట్ ఛానెల్స్ ఇప్పటికే దాని సహ అప్ జియో టి‌విలో అందుబాటులో ఉన్నాయి.  

జియో కోసం, సన్ ఎన్ఎక్స్ టి జియో సినిమాని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఇప్పుడు ది వాల్ట్ డిస్నీ కంపెనీ, ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా యొక్క ఈరోస్ నౌ, బాలాజీ టెలిఫిల్మ్స్ యొక్క ఆల్ట్ బాలాజీ మరియు వయాకామ్ 18 మీడియా యొక్క వుట్ వంటి భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి.

also read స్మార్ట్ టీవీల్లో నెట్‌ఫ్లిక్స్ ఇక పనిచేయదు... 

సన్ ఎన్ఎక్స్ టి కొరకు, ఈ సంవత్సరం ప్రారంభంలో వోడాఫోన్, ఐడియా తరువాత టెలికాం ఆపరేటర్‌తో ఇది రెండవ భాగస్వామ్యం. 30 లైవ్ టీవీ ఛానెల్‌లు, 4 వేల చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, మ్యూజిక్ వీడియోలు మరియు మరింత  కంటెంట్,  మొత్తంగా 50,000 గంటల కంటెంట్‌ పై ఒప్పందం మరింత విస్తృతంగా కలిగి ఉంది.

సన్ ఎన్ఎక్స్ టి 2017 మధ్య నుండి ప్రధానంగా దక్షిణ భారత ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. భారతదేశంలోని ఇతర స్ట్రీమింగ్ సేవల మాదిరిగా కాకుండా, ఇది ఒరిజినల్ కంటెంట్‌లో ఏమాత్రం తగ్గలేదు. సన్ ఎన్ఎక్స్ టి కి పోటీకి దగ్గరగా ఉన్న అప్లికేషన్ యుప్ టివి.