అదిరిపోయే స్పెషల్ ఫీచర్స్ తో విపణిలోకి వివో వీ17...
హోల్ పంచ్ ప్లస్ క్వాడ్ కెమెరాలతో విపణిలో అడుగు పెట్టిన వివో ‘వీ17’ ఫోన్ ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ నెల 17 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర రూ.22,990గా వివో నిర్ణయించింది.
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో తాజాగా వీ17 పేరిట కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ముందు వైపు హోల్‌పంచ్ కెమెరా, వెనుక వైపు ‘L’ ఆకారంలో క్వాడ్ కెమెరాలు ఉండడం దీని ప్రత్యేకత. 8జీబీ విత్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో వస్తున్న ఈ ఫోన్ ధరను రూ.22,990గా వివో నిర్ణయించింది. మిడ్‌నైట్ ఓసన్ (బ్లాక్), గ్రేసియర్ ఐస్ (వైట్) రంగుల్లో లభ్యం కానుంది. ఈ నెల17వ తేదీ నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
also read గార్మిన్ స్మార్ట్ వాచ్చేస్...ఇప్పుడు ఇండియాలో...ధర ఎంతో తెలుసా
వివో వీ 17 కోసం ఫోన్ ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్‌తో పాటు ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఈ ఫోన్ లభ్యం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలుపై డిసెంబర్ 31 వరకు ఐదు శాతం డిస్కౌంట్ లభిస్తుంది. జియో ద్వారా రూ.12వేల విలువ చేసే డేటా ఆఫర్ కూడా లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 9పైతోపాటు ఫన్‌టచ్ ఓఎస్ 9.2తో ఈ ఫోన్ పని చేస్తుంది. 6.44 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఈ3 సూపర్ అమోలెడ్ ఐవ్యూ డిస్‌ప్లే కలిగి ఉంటుందీ ఫోన్. 20:9 యాస్‌పెక్ట్ రేషియోలో ఈ ఫోన్ వస్తోంది. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ వెనుక వైపు 48 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో పాటు 8+2+2 ఎంపీల కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది డిస్‌ప్లేలో అంతర్భాగంగా (హోల్‌పంచ్) ఉంటుంది.
also read గుడ్ న్యూస్ ఆ రెండు ప్లాన్లలోకి జియో రి ఎంట్రీ
సూపర్‌నైట్ మోడ్, అల్ట్రా స్టేబుల్ వీడియో, పోర్ట్రెయిట్ బొకే, పోర్ట్రెయిట్ లైట్ ఎఫెక్ట్, ఏఆర్ స్టిక్కర్స్, పోజ్ మాస్టర్, ఏఐ మేకప్, ఏఐ హెచ్‌డీఆర్ వంటి కెమెరా వసతులు ఉన్నాయి. ముందు వైపు కూడా సూపర్‌నైట్ సెల్ఫీ, ఏఐ హెచ్‌డీఆర్, జెండర్ డిటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, బ్లూటూత్ 5.0, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి వసతులు కల ఈ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది.