గుడ్ న్యూస్ ఆ రెండు ప్లాన్లలోకి జియో రి ఎంట్రీ

అధిక చార్జీలు మోపారన్న విమర్శలకు తోడు ఇతర టెలికం సర్వీస్ ప్రొవైడర్లు ఏ ప్రొవైడర్ కైనా ఉచిత ఔట్ గోయింగ్ కాల్స్ పరిమితి ఎత్తేయడంతో రిలయన్స్ జియో దిగి వచ్చింది. రూ.98, రూ.149 ప్లాన్లను తిరిగి అమలులోకి తెచ్చింది.

Jio Rs. 98 Prepaid Plan Revised to Offer 300 SMS Messages for 28 Days

ముంబై: ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలతోపాటు మొబైల్ టారిఫ్‌లను పెంచిన రిలయన్స్ జియో అత్యంత జాగ్రతతో వ్యవహరించింది. పనిలో పనిగా వినియోగదారులకు లాభదాయకంగా ఉండే రెండు ప్లాన్లను  కూడా ఎత్తివేసింది.పెంచిన చార్జీలు మరీ అధికంగా ఉన్నాయన్న విమర్శలను జియో ఎదుర్కోవాల్సి వచ్చింది.

also read  ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంటే జియో చౌక...కానీ

దీనికి తోడు ఇతర నెట్ వర్క్‌లకు చేసే కాల్స్‌పై ఉన్న పరిమితిని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఎత్తివేసిన నేపథ్యంలో జియో ఈ ప్లాన్లను అమలులోకి తేవడం గమనార్హం. ఈ క్రమంలో రిలయన్స్ జియో తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు కాస్త ఉపశమనం కలిగించింది. రూ. 98, రూ. 149 ప్లాన్లను మళ్లీ ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది.

Jio Rs. 98 Prepaid Plan Revised to Offer 300 SMS Messages for 28 Days
 
ఈ మధ్యే పెంచిన మొబైల్ టారిఫ్‌లకు అనుగుణంగా నూతన ప్లాన్లను లాంచ్ చేసిన జియో అంతకు ముందు ఉన్న రూ. 98, రూ. 149 ప్లాన్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. వాటిల్లో కొంత మేరకు సవరణలు చేసినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో రూ. 98 ప్లాన్‌లో 2 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ సౌకర్యాలు ఉంటాయి. 

also read గార్మిన్ స్మార్ట్‌ వాచ్చేస్...ఇప్పుడు ఇండియాలో...ధర ఎంతో తెలుసా

రూ.98 ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా రిలయన్స్ జియో నిర్ణయించింది. జియో నుంచి ఇతర నెట్ వర్క్స్‌కు ఫోన్ చేస్తే మాత్రం నిమిషానికి ఆరు పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. డేటా పరిమితి పూర్తయ్యాక డేటా వేగం 64 కేబీపీఎస్‌కు పరిమితం అవుతుంది. 
 
అలాగే రూ. 149 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్‌, 300 నిమిషాల నాన్ జియో కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 24 రోజులుగా నిర్ణయించారు. వీటితోపాటు జియో యాప్స్ వినియోగించుకునే వీలు ఉంటుంది. రెండు ప్లాన్లు ప్రస్తుతం జియో అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios