గార్మిన్  బ్రాండ్ ఇప్పుడు రెండు స్మార్ట్ వాచ్ లను ఇండియాలో లాంచ్ చేసింది. గార్మిన్ వేణు, గార్మిన్ వివోయాక్టివ్ 4 స్మార్ట్‌వాచ్‌లు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ వేరబుల్స్ తయారీదారి గార్మిన్  బ్రాండ్  శుక్రవారం భారతదేశంలో అమోలెడ్ స్క్రీన్‌తో మొట్టమొదటి స్మార్ట్‌వాచ్  గార్మిన్ వేణు, వివోయాక్టివ్ 4 జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. గార్మిన్ వేణు స్మార్ట్‌వాచ్  ధర రూ. 37.490, గార్మిన్  వివోయాక్టివ్ 4 జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌ ధర రూ. 32.590. 


ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌వాచ్ లను డిసెంబర్ 15 వరకు అమెజాన్ ఎక్స్‌క్లూజివ్‌ ఆన్ లైన్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. తరువాత టాటా క్లిక్, మైంట్ర, ఫ్లిప్‌కార్ట్, పేటిఎం మాల్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఇది ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా లభిస్తుంది. 

also read ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంటే జియో చౌక...కానీ

 గార్మిన్ వేణు స్మార్ట్ వాచ్ ఫీచర్స్ వచ్చేసి దీనికి 1.2-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, గ్రానైట్ బ్లూ విత్ సిల్వర్ హార్డ్‌వేర్, బ్లాక్ విత్ స్లేట్ హార్డ్‌వేర్, లైట్ స్యండ్ విత్ రోజ్ గోల్డ్ హార్డ్‌వేర్, అలాగే బ్లాక్ విత్ గోల్డ్ హార్డ్‌వేర్ లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ఐదు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అలాగే జిపిఎస్ + మ్యూజిక్ మోడ్‌లో ఆరు గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని పేర్కొన్నారు.

వావోయాక్టివ్ 4 స్మార్ట్ వాచ్ ఫీచర్స్ వచ్చేసి షాడో గ్రే / సిల్వర్ అండ్ బ్లాక్ / స్లేట్ కలర్లలో లభిస్తుంది. ఇది స్మార్ట్ వాచ్ మోడ్‌లో ఎనిమిది రోజుల వరకు, GPS + మ్యూజిక్ మోడ్‌లో 6 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది."గార్మిన్ బ్రాండ్ మొట్టమొదటి AMOLED డిస్ప్లే స్మార్ట్ వాచ్ వేణును భారతదేశంలో లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని గార్మిన్ ఇండియా నేషనల్ సేల్స్ మేనేజర్ అలీ రిజ్వి అన్నారు.

also read వొడాఫోన్-ఐడియా మూతపడనుందా? వాటి వినియోగదారులకు షాకేనా!


"గార్మిన్  వేణు, గార్మిన్  వివోయాక్టివ్ 4 రెండూ స్లీప్ ట్రాకింగ్, బ్రిత్ ట్రాకింగ్,  హార్ట్ బీట్, రిలాక్స్ రిమైండర్‌లతో స్ట్రెస్ ట్రాకింగ్, హైడ్రేషన్ ట్రాకింగ్  వంటి   హెల్త్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. గార్మిన్ స్మార్ట్ వాచ్ లో క్రోమా డిస్ప్లే టెక్నాలజీ  ఉండటం వల్ల ఏ లైటింగ్‌లోనైనా స్క్రీన్‌ను చూడటం సులభంగా ఉంటుంది.

నవంబర్ నెలలో గార్మిన్ బ్రాండ్ ఫెనిక్స్ 6 సిరీస్ స్మార్ట్ వాచ్లను భారతదేశంలో ప్రారంభించింది. మౌంటెన్ బైకింగ్, గోల్ఫింగ్, ట్రైల్ రన్నింగ్, హైకింగ్, డైవింగ్ వంటిని ట్రాక్ చేయడానికి వినియోగదారులకు సహాయపడుతుంది. గార్మిన్ బ్రాండ్ ప్రత్యేకంగా రన్నర్ల కోసం పేస్-స్ట్రాటజీని అందించడానికి పేస్‌ప్రో టెక్నాలజీని ఇందులో అమర్చారు.గార్మిన్ ఫెనిక్స్ 6 స్మార్ట్ వాచ్‌లు ఎక్కువ కాలం బ్యాటరీ లైఫ్ ఇవ్వడానికి పవర్ మేనేజర్‌ను కలిగి ఉంది.